Kundabaddalu Subbarao died due to illness: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సామాజిక విశ్లేషకుడు కుండబద్దలు సుబ్బారావు (67) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. గత దశాబ్ధ కాలంగా కిడ్నీల సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంటి పేరు కాటా. అయితే 'కుండబద్దలు' యూట్యూబ్ ఛానల్ నడపడంతో అదే ఇంటిపేరుగా మారింది. ఆయనకు భార్య పారిజాతం, కుమారులు రాజేష్, గౌతమ్ ఉన్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలోని స్వగృహంలో మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
'కుండబద్దలు'తో ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాటా సుబ్బారావు సాంఘిక, పౌరాణిక నాటకాల రచయితగా, నటునిగా ఖ్యాతి పొందారు. సినీ పరిశ్రమలో 15 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవముంది. దర్శకుడు క్రాంతి కుమార్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశారు. స్వీయ దర్శకత్వంలో సొంత బ్యానర్‌పై ఆవాహన సినిమా నిర్మించారు. ఆ రంగంలో రాణించలేకపోవడంతో స్వగ్రామంలో స్థిరపడ్డారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆయన గ్రామస్థులతో కలిసి ఉద్యమించారు. గణపవరం పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షునిగా వ్యవహారించి కాలుష్యకారకమైన పరిశ్రమల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. 2017లో కుండబద్దలు పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సామాజిక, రాజకీయ విశ్లేషణలతో ఆకట్టుకున్నారు. వార్తల ఛానల్స్ నిర్వహించిన అనేక డిబెట్లలో పాల్గొన్నారు. అమరావతి, రాజధాని రైతుల పక్షాన తన వాణి బలంగా వినిపించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను క్షుణ్ణంగా వివరించే గళం శాశ్వతంగా మూగబోయింది. పలువురు రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుండబద్దల మృతికి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంతాపం వ్యక్తం చేశారు.
రెండ్రోజుల క్రితం గుంటూరు ఆసుపత్రిలో ఆయన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ రోజు విషయం తెలియగానే సంతాపం తెలిపారు.
-
జర్నలిస్ట్ కాటా సుబ్బారావుగారి మరణం విచారకరం. రాజకీయవిశ్లేషకునిగా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గక తన భావాలను నిర్భయంగా,నిర్మొహమాటంగా చెప్పి, కుండబద్దలు సుబ్బారావుగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ జర్నలిజానికి స్ఫూర్తిగా నిలిచారు. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/VIRHYTXbns
— N Chandrababu Naidu (@ncbn) January 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">జర్నలిస్ట్ కాటా సుబ్బారావుగారి మరణం విచారకరం. రాజకీయవిశ్లేషకునిగా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గక తన భావాలను నిర్భయంగా,నిర్మొహమాటంగా చెప్పి, కుండబద్దలు సుబ్బారావుగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ జర్నలిజానికి స్ఫూర్తిగా నిలిచారు. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/VIRHYTXbns
— N Chandrababu Naidu (@ncbn) January 2, 2023జర్నలిస్ట్ కాటా సుబ్బారావుగారి మరణం విచారకరం. రాజకీయవిశ్లేషకునిగా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గక తన భావాలను నిర్భయంగా,నిర్మొహమాటంగా చెప్పి, కుండబద్దలు సుబ్బారావుగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ జర్నలిజానికి స్ఫూర్తిగా నిలిచారు. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/VIRHYTXbns
— N Chandrababu Naidu (@ncbn) January 2, 2023
కుండబద్దలు సుబ్బారావు మృతి పట్ల నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు సుబ్బారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/PncU5MVKvb
— Lokesh Nara (@naralokesh) January 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు సుబ్బారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/PncU5MVKvb
— Lokesh Nara (@naralokesh) January 2, 2023ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు సుబ్బారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/PncU5MVKvb
— Lokesh Nara (@naralokesh) January 2, 2023
ఇవీ చదవండి: