ETV Bharat / state

ప్రాజెక్టులకు పేర్లు పెట్టడం కాదు.. వాటిని పూర్తి చేయాలి : గాదె వెంకటేశ్వరరావు - జనసేన నాయకుల బటన్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలు

Godavari-Penna River Linking Project: గోదావరి-పెన్నా అనుసంధానం కోసం టీడీపీ హయాంలో 2018 లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన జగన్.. తన తండ్రి పేరు పెట్టుకున్నారే తప్ప.. అభివృద్ధి మరిచారని జనసేన పల్నాడు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు విమర్శించారు. నకరికల్లులో ఓ ప్రాజెక్టు ఉందని గుర్తు చేయడానికి వచ్చామని ఆయన తెలిపారు.

నకరికల్లులో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు

author img

By

Published : Apr 12, 2023, 6:18 PM IST

Updated : Apr 12, 2023, 6:33 PM IST

ప్రాజెక్టులకు పేరు పెట్టుకోవడం కాదు

Godavari-Penna River Linking Project : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, జనసేన నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. నకరికల్లులో గత టీడీపీ గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన నిర్వహించారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు.

పేరు పెట్టారు.. అభివృద్ధి మరిచారు : గోదావరి-పెన్నా అనుసంధానం కోసం గత టీడీపీ హయాంలో 2018 లో నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ రోజుతోనే ఈ ప్రాజెక్టును మరచిపోయారని, ప్రభుత్వం మారిన తర్వాత పనులు జరగటం లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ మోహాన్ రెడ్డి అధికాంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోని, వాటికి వారి తండ్రి గారి పేరు పెట్టారు గానీ వాటిని అభివృద్ధిని మరిచారని అన్నారు.

ప్రాజెక్టు ఉందని గుర్తు చేయడానికి వచ్చాం : నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గంలో ప్రాజెక్టుకు టీడీపీ శంకుస్థాపన చేసిన సంగతి ఆయనకు తెలియదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఉందనే విషయం అంబటి కి తెలియజేయడం కోసం జనసేన నాయకులు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలోని నీటి పారుదల ప్రాజెక్టు వైపు ఓసారి చూడండని కోరారు. తక్షణమే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరగా రైతులకు వ్యవసాయ నీటిని అందించాలని గాదె వెంకటేశ్వర రావు సూచించారు.

డౌన్ డౌన్ బటన్ సీఎం నినాదాలు : అదే విధంగా నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేసి ప్రస్తుత రైతులను ఆదుకోవాలన్నారు. పల్నాడు జిల్లాలో ఎండి పోతున్న పంటలను కాపాడాలని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 'ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి.. డౌన్ డౌన్ బటన్ సీఎం'​ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

" 2018లో అట్టహాసంగా టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది. తరువాత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ల నాన్న గారి పేరు పెట్టుకున్నారు. రెండు, మూడు చోట్ల పొలాలు తీసుకున్నారు. ప్రాజెక్టు సంబంధించిన మెటిరియల్​ను అక్కడ పెట్టారు. అవి తుప్పు పట్టి పోతున్నాయి తప్పితే అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు ఈ ప్రాజెక్టు అభివృద్ధి. నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి ఈ ప్రాజెక్టు ఉందని తెలుసో లేదో కూడా తెలియని పరిస్థితి. " - గాదె వెంకటేశ్వర రావు, జనసేన పల్నాడు జిల్లా అధ్యక్షుడు

ఇవీ చదవండి

Last Updated : Apr 12, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.