- తెలుగు 'జేమ్స్‌బాండ్'కి.. రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మృతితో.. నటీనటులు, ప్రముఖులు, అభిమానులు శోకతప్త సంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి.. కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసిందని విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. - సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు.. వారందరి కోసం అంత చేశారా?
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతోనే కాకుండా.. పలు సేవా కార్యక్రమాలతోనూ తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారి గురించే కాకుండా.. సమాజం పట్ల కూడా ఆలోచించేవారు. నేడు ఆయన కన్నుమూయడంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణ చేసిన సామాజిక సేవ గురించి తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కృష్ణ మృతికి సంతాపంగా విజయవాడలో రేపు ఉదయం సినిమాలు బంద్
సినీ నటుడు కృష్ణ మృతిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు విజయవాడలో ఉదయం సినిమాల ప్రదర్శన నిలుపుదల చేస్తునట్లు వారు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించటం బాధాకరంగా ఉందన్నారు. విజయవాడ నగరానికి కృష్ణకు ఎనలేని అనుబంధం ఉందని వివరించారు. వ్యక్తిగతంగా కృష్ణ చాలా మంచి వ్యక్తి అని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిమాన్షు నోట బాలయ్య డైలాగ్... వైరల్‌గా మారిన ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ ట్వీట్‌కు బాలయ్య డైలాగ్‌తో రిప్లై ఇచ్చి.. షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు.. హిమాన్షును చూసిన నెటిజన్స్.. సేమ్ టు సేమ్ కేటీఆర్‌లా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: శైలజానాథ్
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం.. భాజపా అజెండాను అమలు చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని మోదీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ!
రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకునేందుకు ఐఆర్సీటీసీకి అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రద్ధ మర్డర్ కేసు.. 12 బాడీ పార్ట్స్ స్వాధీనం.. జైలులో ప్రశాంతంగా నిందితుడి నిద్ర!
సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పలు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అవి శ్రద్ధ మృతదేహం భాగాలనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జైలులో ఉన్న నిందితుడు అఫ్తాబ్ ప్రశాంతంగా నిద్రిస్తున్న వీడియో బయటకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాలికి శస్త్ర చికిత్స.. వైద్యుల నిర్లక్ష్యంతో ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
తమిళనాడులో దారుణం జరిగింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ ఫుట్‌బాల్ ప్లేయర్.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా మంగళవారం 800 కోట్లు దాటింది. ఇది మానవాళికి ఒక చారిత్రక మైలురాయి అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. వైద్యం, పోషణ, వ్యక్తిగత శుభ్రత సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం సంతానోత్పత్తి తగ్గడం, పడిపోతుండటం కారణంగా ప్రపంచ జనాభా పెరుగుదల తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉమ్రాన్ మాలిక్ టాలెంట్‌పై కేన్ కీలక వ్యాఖ్యలు.. నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌ల సందడి మొదలు కానుంది. నవంబర్ 18 నుంచి భారత్-కివీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పలు కీలక విషయాలపై మాట్లాడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.