ETV Bharat / state

Worst Condition in Jagananna Colonies: చెరువుల్లా జగనన్న కాలనీలు.. జనసైనికుల పడవ ప్రయాణం - Failure Of Jagananna Colony

Flood to Jagananna colonies: జగనన్న కాలనీల్లో భారీగా అవినీతి జరుగుతోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జనసైనికులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు జగనన్న కాలనీలను సందర్శించారు. జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. 'హలో ఏపీ.. బై బై వైసీపీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

JanaSena Leaders Digital Capping in Jagananna Colonies
జగనన్న కాలనీల్లో జనసేన నేతల డిజిటల్ క్యాపెయినింగ్
author img

By

Published : Jul 29, 2023, 7:58 PM IST

Updated : Jul 29, 2023, 10:18 PM IST

ఫెయిల్యూర్‌ ఆఫ్ జగనన్న కాలనీ డిజిటల్ క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన

Janasena Leaders Digital Campaign in Jagananna Colonies : గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ పరిస్థితిలో జగనన్న కాలనీల పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్​కు పిలుపును ఇచ్చారు. దీంతో జనసైనికులు "ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ డిజిటల్ క్యాంపెయిన్" పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో టీడీపీ నాయకులు జగనన్న లేఅవుట్​లో ఈత కొట్టారు. జనసేన నేతలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా పడవలో ప్రయాణం చేసి.. వారి నిరసనను తెలియజేశారు.

ప్రజలను మోసం చేసిన జగన్ : ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి.. నాసిరకం నిర్మాణాలతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని కొడిమి సమీపంలో ఉన్న జగనన్న లే అవుట్​ను జనసేన నాయకులు పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకుండా నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే కుట్రతోనే ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు.

నీటి కుంటలో నిరసన : జగనన్న కాలనీలా నీటి కుంటలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం కుడుతూరులో జగనన్న కాలనీలో పార్టీ శ్రేణులతో జగనన్న కాలనీలను సందర్శించారు. పేదలకు అనువుగాని చోట ఇళ్ల స్థలాలు కేటాయించడంతో ఇంటి నిర్మాణాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగనన్న కాలనీలోని నీటి కుంటలో దిగి మధుసూదన్ రెడ్డి నిరసన తెలిపారు

పడవలో ప్రయాణం : ఎన్టీఆర్ జిల్లా బందరు మండలం చినకరగ్రహారం గ్రామంలో మోకాలు లోతు పైబడి వర్షపు నీటితో మునిగిపోయిన జగనన్న లే అవుట్​లో జనసేన నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జలమయమైన కాలనీలో పడవలో ప్రయాణించి జనసేన నేతలు నిరసన తెలిపారు.

ప్రారంభం కానీ ఇళ్ల నిర్మాణం : జగనన్న కాలనీల పేరుతో భారీగా అవినీతి జరుగుతోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లాలో పలు మండలాల్లో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. వైసీపీ కాంట్రాక్టర్ల అవినీతికి తప్ప, జగనన్న కాలనీలతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని జనసేన నేత కిషోర్ విమర్శించారు. టపాతోపు వద్ద మలిదేవి కాలువ పక్కనే ఎకరా పొలం 25 లక్షలకు కొనుగోలు చేసి జగనన్న కాలనీ ఏర్పాటు చేసిన, కనీసం ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. వర్షాలు పడితే ఈ ప్రాంతం ముంపునకు గురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టాలం వద్ద జగనన్న కాలనీలో ఇల్లు కట్టేందుకు కాంట్రాక్టర్లు ప్రజల నుంచి నగదు వసూలు చెయ్యడమే కాకుండా, ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో వేసే సొమ్మును దిగముంగుతున్నారని ఆరోపించారు.

హలో ఏపీ బై బై వైసీపీ : ఇల్లు లేని పేదవాడి కల, కలగానే మిగిలిపోయిందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సకాలంలో పేదలకు ఇళ్లు అందించి వారి కలను సాకారం చేయవలసిందిగా జనసేన నేతల డిమాండ్ చేశారు. 'హలో ఏపీ.. బై బై వైసీపీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Last Updated : Jul 29, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.