Lack of Facilities in Autonagar: అక్కడ పారిశ్రామికవాడ ఆరు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. లక్ష మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. కానీ నేటికీ అక్కడ మంచినీటి వసతి లేదు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగాలేదు. చిన్న వర్షం పడినా.. ఉపాధి గల్లంతే..! ఈ దుస్థితి బెజవాడ ఆటోనగర్‌లో ఏర్పడింది. కనీస వసతులకు నోచుకోలేకపోతోంది ఆటోనగర్.
Autonagar Workers Problems: ఆసియాలోనే గొప్ప పేరు గడించిన బెజవాడ ఆటోనగర్ మౌలిక వసతులు లేక సతమతమౌతోంది. 1966లో ఏర్పాటైన బెజవాడ ఆటోనగర్‌లో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ కలిపి.. సుమారు 3వేలున్నాయి. పారిశ్రామికవాడ ఏర్పడి 56 ఏళ్లవుతున్నా.. నేటికీ తాగునీటి వసతి లేదు. మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగాలేదు. రోడ్లు పాడయ్యాయి. మురుగు కాలువల్లో.. చెత్తాచెదారం చేరింది. వర్షం పడితే మురుగునీరు రోడ్లను ముంచెత్తుతోంది. చిన్న వర్షం పడినా.. రోజుల తరబడి నీరు రోడ్లపైనే ఉంటోంది. తడి వాతావరణం ఉంటే.. వెల్డింగ్ పనులు సాగే పరిస్థితి లేక కార్మికులు.. రోజుల తరబడి ఉపాధి కోల్పోతున్నారు.
Workers Facing Problems Due to Lack of Facilities: లక్ష మంది కార్మికులు పనిచేస్తున్న ఆటోనగర్‌లో కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు. సరైన సమయానికి వైద్యం అందక గతంలో.. కొందరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆటోనగర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎంపీ నిధులతో ఓ వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. దీన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తే తాగునీటి సమస్య తీరుతుంది. అధికారులు ఆ దిశగా సహకారం అందించాలని కార్మికులు కోరుతున్నారు.
Drinking Water Problem: ఆటోనగర్ దుస్థితి.. వానకాలంలోనూ తాగునీటి సమస్య.. వెంటాడుతున్న డ్రైనేజీ సమస్య
"ఆటోనగర్‌లో కనీస మౌలిక వసతులు లేవు. నేటికీ ఇక్కడ తాగునీటి వసతిలేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగాలేదు. రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మురుగు కాలువల్లో.. చెత్తాచెదారం చేరింది. వర్షం పడితే మురుగునీరు రోడ్లను ముంచెత్తుతోంది. చిన్న వర్షం పడినా.. రోజుల తరబడి నీరు రోడ్లపైనే ఉంటోంది. తడి వాతావరణం ఉంటే.. వెల్డింగ్ పనులు సాగే పరిస్థితి లేక మేము.. రోజుల తరబడి ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. లక్ష మంది కార్మికులు పనిచేస్తున్న ఆటోనగర్‌లో కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు. సరైన సమయానికి వైద్యం అందక గతంలో.. కొందరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అధికారులు స్పందించి.. ఆటోనగర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం." -కార్మికులు