Woman Suicide Attempt: విజయవాడ వన్ టౌన్ ఫ్లవర్ మార్కెట్ వద్ద పాయకాపురానికి చెందిన మహిళ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఫైర్ సిబ్బంది, గవర్నర్‌పేట పోలీసులు మహిళను కాపాడి ఆరా తీయగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని.. అందుకే కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు షకీలా తెలిపింది. గవర్నర్‌పేట స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, ఫైర్ సిబ్బంది జె. నాగరాజు, ఎ. శివరామకృష్ణ, రాజ్ కుమార్, డి. రాంబాబు, లోకేష్, బాలకృష్ణమూర్తి కాలువలోకి దూకి మహిళను బయటకు తీసుకువచ్చారు. మహిళను గవర్నర్‌పేట స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇవీ చదవండి: