ETV Bharat / state

37 నిమిషాలలో 1200 గుంజీలు.. విజయవాడ విద్యార్థి రికార్డ్​

Telugu Book Of Records: చిన్నప్పుడు పాఠశాలకు ఆలస్యంగా వస్తేనో.. లేదంటే హోం వర్క్‌ చేయకుండా వెళ్లినప్పుడో.. గుంజీలు తీయమంటూ ఉపాధ్యాయులు శిక్షించేవారు. చాలా మంది పిల్లలకు 100 గుంజీలు తీయడానికే ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ, ఓ బాలుడు మాత్రం గుంజీలు తీయడంలోనే రికార్డు సృష్టించాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. పట్టుదలతో సాధన చేసి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న సాత్విక్‌ గురించి ఈ కథనం.

Telugu Book Of Records
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌
author img

By

Published : Oct 9, 2022, 8:10 PM IST

37 నిమిషాలలో 1200 గుంజీలు.. విజయవాడ విద్యార్థి రికార్డ్​

Telugu Book Of Records: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన సాత్విక్‌ అనే బాలుడు. ప్రస్తుతం మనం చూస్తున్న బాలుడి వయస్సు 8ఏళ్లే కానీ, అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నిష్ణాతులైన శిక్షకుల సహకారంతో చిన్న వయస్సులోనే అసమాన విజయాలను అందుకుంటున్నాడు. 37 నిమిషాల వ్యవధిలో 1,200 గుంజీలు తీసి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం 20 రోజుల సాధనతోనే తమ కుమారుడు ఈ ఘనత సాధించాడని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయస్సు కావటంతో.. ఇబ్బంది పడతాడేమోనని భావించినా.. సాత్విక్ సాధించి చూపాడని వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ తెలిపారు. భవిష్యత్తులో మెరుగైన శిక్షణ ఇచ్చి.. మరిన్ని పతకాలు సాధించేలా చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో ఓ వ్యక్తి గుంజీలు తీస్తూ చేసిన వీడియో చూడటంతో తనకూ అలా రికార్డు సృష్టించాలనే కోరిక కలిగిందని సాత్విక్‌ తెలిపాడు. ఇందుకోసం తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతగానో ప్రోత్సహించారన్నారు. భవిష్యత్తులో బాగా సాధన చేసి మరిన్ని రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నిస్తామని సాత్విక్‌తోపాటు వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు.

"రోజు గుంజీలు తీయటం వలనే నాకు ఈ రికార్డు సొంతం అయ్యింది. రోజు గుంజీలు తీయటం వల్ల నాకు ఈ రికార్డు సంపాదించడానికి ప్రాక్టిస్​ అయ్యింది. నలభై రోజులు ప్రాక్టిస్​ చేసి నేను ఈ రికార్డు సాధించాను. దీనిలో మా తల్లిదండ్రులు, కోచ్​ ప్రోత్సహం వల్లే నాకు ఈ రికార్డు సాధ్యం అయ్యింది". : -సాత్విక్, విద్యార్థి

"నేను ఫిట్​నెస్ కోచ్​గా విద్యార్థులకు సేవలను అందిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ఒక అబ్బాయి గుంజీలు తీసీ రికార్డు సాధించిన వీడియో చూసాను. అది చూసి నా దగ్గర ఉన్న పిల్లల్లో ఒకర్ని ఇలా తయారు చేయాలి అనుకున్నాను. సాత్విక్​ ముందుకు రాగానే అతని తల్లిదండ్రులకు చెప్పటంతో ఒప్పుకున్నారు. వెంటనే ప్రాక్టీస్​ మొదలుపెట్టాము. ఇరవై రోజులలో సాత్విక్​ రికార్డును సాధించాడు". -శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.