ETV Bharat / state

Today Road Accidents in AP: విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

Today Road Accidents in AP : రాష్టంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Today_Road_Accidents_in_AP
Today_Road_Accidents_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 4:37 PM IST

Today Road Accidents in AP : ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్​లో.. కోనసీమ జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు 52 మంది ప్రయాణికులు శనివారం ఉదయం బయలు దేరారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం గ్రామ సమీపంలోని పులి వాగు వంతెన వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు బలంగా (RTC bus Hit Lorry in Koyyalagudem) ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం తీవ్ర గాయాల పాలైన వారిని రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

బీభత్సం సృష్టించిన కారు.. తప్పిన పెను ప్రమాదం : విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా బారికేడ్‌లను (Road Accident on Vijayawada BRTS Road) ఢీ కొంది. డివైడర్ల మీద నుంచి దూసుకెళ్లి ముగ్గురు విద్యార్ధులను గాయపరిచింది. హుటాహుటిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తక్షణ వైద్య సహాయం కోసం తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో.. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Car Accident in Dhone: మద్యం మత్తులో బైక్​లను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించిన కారు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

అతి వేగంగా వెళ్తున్న కారుని నియంత్రించలేకే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గుణదల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కారు డ్రైవర్​ను విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డివైడర్​ను ఢీకొని యువకుడు మృతి : శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో యువకునికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం వైయస్సార్ జిల్లా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎర్రగుంట్ల మండలం అయ్యప్ప స్వామి గుడి వద్ద ద్విచక్ర వాహనం డివైడర్​ను (Young Man Died After Hitting the Divider) ఢీకొట్టి పాల వాహనంపై పడింది.

Car Crashed into the Canal: తూర్పుగోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి

ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన యువకుడు పోట్ల గుత్తి గ్రామానికి చెందిన గుర్రప్ప(20)గా గుర్తించారు. దస్తగిరి అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్​కు తరలించారు.

జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా మునగచర్ల క్రాస్​ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 1:00 సమయంలో మునగచెర్ల క్రాస్​ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ బస్సులో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నందిగామ ఏసీపీ జనార్దన్ రాయుడు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

RTC Bus Skidded: ఎన్టీఆర్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.