TIDCO HOUSES: విజయవాడ సమీపాన జక్కంపూడి కాలనీలోని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి తీసుకువచ్చిన నిర్మాణ సామాగ్రి అన్యాక్రాంతం అవుతోంది. ప్రభుత్వం లక్షల రుపాయాల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనికి రాకుండా పొతోంది. ఇంటి నిర్మాణం కోసం వినియోగించే కిటికీలు, తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. అలాగే ఇంట్లో నేలపై పరిచేందుకు ఉపయోగించే టైల్స్‌ను పగలకొట్టారు. ప్రభుత్వం మాత్రం డిసెంబర్లో టిడ్కో లబ్దిదారులచే సాముహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని గోప్పలు చెబుతోంది. నిర్మాణ సామాగ్రిని ద్వంసం చేస్తుండటంపై లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: