Thugs Kidnapped and Attacked on Young Man: ఏన్టీఆర్ జిల్లాలో యువకుల మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. ఏడాది క్రితం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ దళిత యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆరుగురు యువకులు కలిసి ఆ యువకుడ్ని కిడ్నాప్ చేశారు. కారులో ఆ యువకుడ్ని ఎక్కించుకుని దాడి చేస్తూ.. కారును రోడ్లపై తిప్పుతూ గుంటూరు వరకు తీసుకువెళ్లారు. అనంతరం ఆ యువకుడ్ని గుంటూరు వద్ద కారులోనే వదిలి వెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కంచికచర్ల పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ అనే యువకుడు.. నందిగామలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అతను డిగ్రి చదువుతున్న సమయంలో అతని స్నేహితులకు.. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలోని ఇంజనీరింగ్ విద్యార్థికి మధ్య వివాదం చోటు చేసుకుంది.
నెల్లూరు ఘటన మరువకముందే మరొకటి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఉపాధ్యాయుడి దాడి
సర్టిఫికేట్ల కోసం వెళ్లిన సమయంలో కిడ్నాప్: ఇంజనీరింగ్ విద్యార్థికి శ్యామ్ కుమార్ స్నేహితుల మధ్య వివాదం ముదిరి దాడికి దారి తీసింది. శ్యామ్ కుమార్ స్నేహితులు ఆ విద్యార్థిపై దాడికి దిగారు. దీంతో ఆ యువకుడు ఈ దాడిని మనసులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్యామ్‌కుమార్ తన కళాశాలకు సర్టిఫికెట్లకోసం వెళ్లిన సందర్భంలో.. ఆ యువకుడికి శ్యామ్‌కుమార్‌కు మధ్య వివాదం జరిగింది.
వివాదం ముదరడంతో ఆ యువకుడితో పాటు తన మిత్రులు కలిసి.. శ్యామ్ కుమార్‌ను బలవంతంగా కారు ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో శ్యామ్ కుమార్ మిత్రుడు బంధువులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో బంధువులు, శ్యామ్ కుమార్ మిత్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి గుంటూరు టోల్‌గేట్ సమీపంలో కారుతో సహా యువకుడ్ని వదిలి వెళ్లినట్లు తెలిసింది.
'సంచలన ఘటనతో ఫేమస్ అయ్యేందుకే ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదు'
గుంటూరులో లభ్యమైన ఆచూకీ: దాడికి గురైన బాధితుడు టోల్గెేట్ సమీపంలో ఉన్న విషయాన్ని తన సోదరుడికి ఫోన్ చేసి వివరించగా.. అక్కడికి వెళ్లి బాధితుడ్ని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దాడి చేశారని శ్యామ్ కుమార్ తెలిపినట్లు అతని సోదరుడు వివరించాడు. దాడి అంశం ఎవరికైనా చెప్పితే చంపుతామని బెదిరించినట్లు వాపోయాడు.
శ్యామ్ కుమార్‌ను ప్రస్తుతం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్యామ్ కుమార్ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నందిగామ బీఎస్పీ నేత ఉదయ్‌కిరణ్ స్పందిస్తూ.. దుండగులు యువకులపై అమానుషంగా దాడికి దిగారని అన్నారు. పైశాచికంగా వ్యవహరిస్తూ.. కారులో తిప్పుతూ దాడి చేశారని .. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.