ETV Bharat / state

నైపుణ్యాభివృద్ధి కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

AP High Court On CID Petition:సీమెన్స్‌ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను 35వ నిందితునిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం ఈ నెల 9న విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. భాస్కర్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ మూడో అదనపు జిల్లా కోర్టు (అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానం) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

HC on CID
HC on CID
author img

By

Published : Mar 17, 2023, 9:50 AM IST

AP High Court On CID Petition : సీమెన్స్‌ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ మూడో అదనపు జిల్లా కోర్టు (అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానం) ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వుల కారణంగా దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. రిమాండ్‌ తిరస్కరణను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీమెన్స్‌తో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.

భాస్కర్‌ను 35వ నిందితునిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం ఈ నెల 9న విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్‌ విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలంది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళగిరి సీఐడీ డీఎస్పీ హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తీవ్రమైన నేరాల విషయంలోనూ నిందితులకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని మెజిస్ట్రేట్లు రిమాండ్‌ తిరస్కరిస్తున్నారన్నారు. నిందితులను వదిలేసి, 41ఏ నోటీసు ఇవ్వాలని యాంత్రిక ధోరణిలో ఆదేశాలిస్తున్నారన్నారు. రిమాండ్‌ దశలో మినీ ట్రైల్‌ (స్వల్ప విచారణ) చేయద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.

భాస్కర్‌ ఇతర నిందితులతో కలిసి ప్రాజెక్టు వ్యయాన్ని 3,300 కోట్లకు పెంచారన్నారు. తద్వారా ఏపీ ప్రభుత్వం 371 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవగాహన ఒప్పందం (ఎంవోయూ), ప్రాజెక్టు అంచాన విలువను భాస్కర్‌ తారుమారు చేశారన్నారు. పబ్లిక్‌ సరెంట్ల నిర్వచనం కిందకు ఆయన రాకపోయినా కుట్రలో భాగస్వామి అన్నారు. ఐపీసీ సెక్షన్‌ 409 (పబ్లిక్‌ సర్వెంట్, బ్యాంకర్, మర్చెంట్, ఏజెంట్‌ నేరపూర్వక విశ్వాస ఘాతకానికి పాల్పడటం) ఆయనకు వర్తించదని న్యాయాధికారి పేర్కొనడం సరికాదన్నారు. విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు.నిందితుడి తరఫున న్యాయవాది వీఆర్‌ మాచవరం వాదనలు వినిపించారు.

దిగువ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసే అధికారం సీఐడీకి లేదన్నారు. 409 సెక్షన్‌ భాస్కర్‌కు వర్తించదన్నారు. లోతుల్లోకి వెళ్లి వివరాలను పరిశీలించాకే విజయవాడ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిందన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి విజయవాడ కోర్టు ఉత్తర్వులను కొట్టి వేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.