ETV Bharat / state

బ్రిటీష్​ వాళ్లకు పట్టిన గతే జగన్​కు పట్టడం ఖాయం: టీడీపీ - TDP Latest News

TDP fire on YSRCP Govt: చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవటంపై టీడీపీ నేతలు స్పందించారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతుందని వారు విమర్శించారు. టీడీపీ పర్యటనలను అడ్డుకోడానికే చీకటి జీవోలు తీసుకువచ్చారని ద్వజమెత్తారు. పర్యటన అడ్డుకోవాలని చూడటం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 4, 2023, 5:48 PM IST

TDP fire on YSRCP Govt: కుప్పం రచ్చబండలో గ్రామసభ కోసం ఏర్పాటు చేసిన వేదికను పోలీసులతో తొలగించటం, పోలీసు శాఖకే అవమానమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే బ్రిటీషు వారికి పట్టిన గతే జగన్​కు పట్టడం ఖాయమని హెచ్చరించారు. గుంటూరు సభలో జరిగిన ఘటనలకు వైసీపీ స్లీపర్​ సెల్స్​ కారణమని ఆరోపించారు. కుప్పంలో పోలీసుల ఓవరాక్షన్​కు.. డీజీపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది : రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ హోంమంత్రి చినరాజప్ప ధ్వజమెత్తారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు విధించిన నిబంధనలు జగన్​ సభలకు వర్తించవా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్​లకు వస్తున్న ప్రజాదరణను జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. జగన్ ఎన్ని జీవోలు తెచ్చి.. ఏం చేసినాసరే టీడీపీ ప్రజాయాత్రలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్రజలు తిరగబడితే జగన్​ తాడేపల్లిలో ఉండలేరు : ముఖ్యమంత్రి జగన్​ చీకటి జీవోలతో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే జగన్‌.. తాడేపల్లి కొంపలో ఉండలేరని ఆయన విమర్శించారు. విశాఖకు పారిపోయే క్రమంలో భాగంగానే చీకటి జీవోలు తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం మానుకుని బందోబస్తు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పర్యటన అడ్డుకోవటం సిగ్గమాలిన చర్య : చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు విమర్శించారు. టీడీపీ సభలను అడ్డుకునేందుకే చీకటి జీవోలు తీసుకొచ్చారంటే.. ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి కానీ.. పర్యటనలు అడ్డుకోవటం ఏంటనీ మండిపడ్డారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో.. బ్రిటిషు ప్రభుత్వం కూడా ఇలాంటి అంక్షాలు విధించలేదని అన్నారు.

చీకటి జీవోలతో ప్రజాస్వామ్య హక్కుల్ని అడ్డుకోలేరని.. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నియంత్రించలేకపోతున్నానని జగన్‌ రెడ్డి చీకటి జీవోలతో చెప్తున్నందున.. ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేరాంధ్రప్రదేశ్​గా ముద్ర పడిన ఏపీలో పోలీసులు.. నేరాలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.