ETV Bharat / state

TDP Dalit leaders చంద్రబాబుపై రాళ్ల దాడిపై టీడీపీ దళితనేతల ఫోకస్.. కార్యాచరణ దిశగా - tdp news

TDP on Dalit leaders టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లదాడి వెనుకున్న కుట్రను బయటపెట్టాల్సిందేనని.. టీడీపీ దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. దళితలను సొంత ప్రయోజనాలకు వాడుకున్న సీఎం జగన్.. ప్రతిపక్షనేతలపై కూడా దళితలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలతోనే దళితలు అభివృద్ది చెందారని, జగన్ పాలనలోని దళితులకు జరిగిన అన్యాయంపై జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై త్వరలో పుస్తం విడుదల చేసేందుకు నేతలు సిద్దమవుతున్నారు.

Dalit Welfare
టీడీపీ
author img

By

Published : Apr 24, 2023, 5:35 PM IST

Updated : Apr 25, 2023, 8:16 AM IST

YCP Vs TDP on Dalit Welfare: చంద్రబాబు పర్యటనలను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంపై తెదేపా సీరియస్ గా తీసుకుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో బాబు పర్యటనలకు కావాలని వైసీపీ ఆటంకాలు కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం వద్ద దళితులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పడం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెున్న ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకుని రాళ్ల దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో దళితులకు ఉన్న గౌవరం ఎలాంటిదో వివరించే ప్రయత్నం చేసేందుకు టీడీపీకి చెందిన దళిత నేతలు సిద్ధమయ్యారు.

టీడీపీ-వైసీపీ హయాంలో జరిగిన ఎస్సీ సంక్షేమాన్ని చర్చనీయాంశం చేయాలని భావిస్తోందన్నారు. టీడీపీ ఎస్సీ నేతలు ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో భేటీ కానున్నారు. జగన్ పాలనలోని సంక్షేమం విషయంలో దళితులకు జరిగిన అన్యాయంపై నేతలు చర్చించనున్నారు. వైసీపీ హయాంలో ఎస్సీలపై జరిగిన దాడులు.. అరాచకాలపై టీడీపీ ఎస్సీ నేతలు పుస్తకం విడుదల చేయనున్నారు. వైసీపీ అగ్ర కుల ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలను ప్రస్తావించనున్నారు. పేదల సంపదను.. సహజ వనరులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏ విధంగా దోచుకుంటున్నారనే అంశాన్ని టీడీపీ ఎస్సీ సెల్ తరపున ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఎస్సీలపై వైసీపీ నేతల దాడుల అంశాన్నీ భేటీలో ప్రస్తావించనున్నారు. టీడీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందుగా పెదకూరపాడు ఎమ్మెల్యే అవినీతి, అరాచకాల చిట్టా రెడీ చేస్తున్నామని టీడీపీ ఎస్సీ నేతలు తెలిపారు.

ఇదీ జరిగింది: ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకుని రాళ్ల దాడి చేశారు. వైసీపీ నేతల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలతో పాటుగా... చంద్రబాబుకు రక్షణగా ఉన్న ఎన్ఎస్‌జీ కమాండో సంతోష్ కుమార్​కు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనలో దళితులపై కాల్పులు జరిగేలా జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ ద్వారా కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ.. ఆధారాలంటూ ఇప్పటికే పలు వీడియోలు విడుదల చేసింది. నల్ల టీషర్ట్ వేసుకుని కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి ఐ ప్యాక్ సభ్యుడని ఈ సంఘటలో మంత్రి ఆదిమూలపు సురేష్ పక్కనే ఉన్నాడని తెలుగు దేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఐ ప్యాక్ చెందిన ఈ వ్యక్తి సభ్యుడు మంత్రి వెంటే ఉండి.. చంద్రబాబుపై దాడికి సలహాలిస్తున్న తీరుతో పాటు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న తీరును ప్రజలు గ్రహించాలని టీడీపీ కోరింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.