ETV Bharat / state

ఎన్​ఆర్​ఐ వివాదం.. ఆర్బిట్రేటర్​కు సుప్రీం అనుమతి.. - ఈడీ అధికారులు ఎన్​ఆర్​ఐ

NRI Academy : ఎన్​ఆర్​ఐ భాగస్వాముల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఏపీ హైకోర్టు గతంలో ఆర్బిట్రేటర్​ను నియమించింది. ఇదేకాకుండా.. విశాఖలోని ఎన్​ఆర్​ఐ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​లో కీలకంగా వ్యవహరించిన కొందరిని ఈడీ విచారించింది.

NRI Academy
సుప్రీం
author img

By

Published : Dec 14, 2022, 12:30 PM IST

NRI Academy : ఎన్​ఆర్​ఐ అకాడమీ భాగస్వాముల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి ఏపీ హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్.. తన పని కొనసాగించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించడానికి ఝార్ఖండ్‌ మాజీ డీజీపీ ఎంవీ రావును నియమిస్తూ ఆర్బిట్రేటర్ జస్టిస్‌ దేవిందర్‌గుప్త ఉత్తర్వులు జారీచేయడాన్ని.. సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే ఈ ఉత్తర్వులతో సంబంధం లేకుండా ఆర్బిట్రేటర్ తన పని కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఎస్​ఎల్​పీ పై ఇక్కడ విచారణ కొనసాగడం ఆర్బిట్రేటర్‌కు అడ్డంకి కాదని.. ఆయన తన పని యథాతథంగా కొనసాగించవచ్చని తెలిపింది.

అటు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్​ఆర్​ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో గతంలో కీలకపాత్ర పోషించిన కొందరిని.. విశాఖలో ఈడీ అధికారులు మంగళవారం విచారణ చేశారు. వారం రోజుల కిందట ఈడీ అధికారులు ఎన్​ఆర్​ఐ కళాశాలతోపాటు ఆసుపత్రిలోనూ తనిఖీలు చేసి రికార్డులు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్​ఆర్​ అకౌంట్ల విభాగాలకు చెందిన ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆసుపత్రి, కళాశాల నిధులను వినియోగించిన సరళిపై వివరాలు తెలుసుకున్నారు. వారి వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాల వివరాలనూ ఆరా తీశారు. ఇవాళ కూడా మరి కొందరిని విచారణ చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.