ETV Bharat / state

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్​లకు పురస్కారాలు

Sahitya Akademi Awards: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. మొత్తం 23 భాషల సాహితీకారులను ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’నవల 2022 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. మరో రచయిత, కవి "వారాల ఆనంద్‌"కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది.

sahitya akademi awards
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన
author img

By

Published : Dec 23, 2022, 10:58 AM IST

Sahitya Akademi Awards: ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. మరో రచయిత, కవి "వారాల ఆనంద్‌"కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది. దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీ వ్యవస్థ, క్రమంగా పెరిగిన తీరు, క్షీణత, దేవదాసీలుగా ఉంటూ ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’నవల 2022 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. బ్రిటిష్‌ పాలకులొచ్చాక దేవదాసీల ఈనాం భూములను రద్దు చేయడంతో వారి జీవితాల్లో వచ్చిన మార్పులు, దేవదాసీల మనోగతాన్ని చిత్తూరు యాసలో రచయిత వివరించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు

ఈ నవలకు గతంలో ‘ఆటా’ బహుమతి కూడా దక్కింది. ప్రముఖ కవి గుల్జార్‌ హిందీలో రచించిన ‘గ్రీన్‌ పోయెమ్స్​ను ఆకుపచ్చ కవితలు’గా వారాల ఆనంద్‌ అనువదించారు. దీనికి అనువాద పురస్కారం దక్కింది. ప్రకృతిని కళ్లకు కట్టినట్లు సజీవ సాక్ష్యాలతో వర్ణించిన గుల్జార్‌ హిందీ కవితలను తెలుగులోనే రాశారా అన్నట్లుగా వారాల ఆనంద్‌ అనువదించారు. మొత్తం 23 భాషల సాహితీకారులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.