Rayalaseema: పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంత వాసులను మోసం చేస్తున్నారని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి అన్నారు. 2014 విభజన చట్టంలో రాయలసీమ సాగు సాగునీటికై పొందుపరిచిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాయలసీమ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీంట్లో భాగంగా విభజన చట్టంలో రాయలసీమ అభివృద్ధికై పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై.. రాయలసీమ అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి వట్టి మాటలే చెబుతున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతో రాయలసీమ అభివృద్ధి చెందదని ప్రజలకు తెలుసని అన్నారు.
ఇవీ చదవండి: