ETV Bharat / state

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో పర్యటన.. వివరాలివిగో..

President Murmu Tour రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ దినోత్సవ సందర్భంగా నిర్వహించే విన్యాసాలను రాష్ట్రపతి తిలకించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి నేడు రాష్ట్రపతి ముర్ము రానున్నారు. విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు. తర్వాత రోజు తిరుపతి వెళ్లి అక్కడి నుంచి దిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు.

President Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
author img

By

Published : Dec 3, 2022, 7:37 PM IST

Updated : Dec 4, 2022, 7:09 AM IST

President Murmu Tour In AP రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. నేడు ఉదయం 10.30కు విజయవాడకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. విజయవాడలో ఆమెకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. తర్వాత 11గంటల 45 నిమిషాలకు పోరంకిలో రాష్ట్రపతికి పౌరసన్మానం కార్యక్రమంలో ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. ప్రభుత్వం రాష్ట్రపతి రాకకు గౌరవార్థంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందును దేశ ప్రథమ పౌరురాలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2గంటల 45నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ముర్ము 3.45 గంటలకు ఐఎన్ఎస్ డేగా చేరుకోనున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం 6 గంటలకు ఆర్‌కే బీచ్‌లో నౌకాదళ ప్రదర్శనను రాష్ట్రపతి తిలకించనున్నారు. రక్షణ, ఉపరితల రవాణాశాఖల వివిధ ప్రాజెక్టులను ఆమె వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇవేకాకుండా

  • కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్‌రేంజ్ ప్రాజెక్టు
  • కృష్ణాజిల్లా నిమ్మలూరులోని భెల్ ప్రాజెక్టు పరిశ్రమ
  • రాయచోటి-అంగలూరు మధ్య హైవే ప్రాజెక్టు
  • నాలుగు వరుసల ఆర్‌వోబీకి ప్రారంభోత్సవం
  • కర్నూలు ఐటీసీ జంక్షన్‌లో 6 వరుసల స్లిప్‌రోడ్
  • ముదిగుబ్బ-పుటపర్తి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
  • రాజమహేంద్రవరంలోని ఏకలవ్య మోడల్ స్కూల్, సైన్స్‌ సెంటర్‌లను ఆమె వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

విశాఖలోని నౌకాదళ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలోనే పద్మావతి అతిథిగృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించనున్నారు. ఉదయం 10గంటల 40నిమిషాలకు పద్మావతి కళాశాల విద్యార్థినులతో బేటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడినుంచి ఒంటి గంట 40 నిమిషాలకు బయలుదేరి దిల్లీ వెళ్లనున్నారు. ఇంతటితో రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం ముగియనుంది.

పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విజయవాడ విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి మొదటి సారిగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అన్ని ప్రణాళిక ప్రకారం జరగాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి విజయవాడలో ప్రయాణించే మార్గాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. రాష్ట్రపతికి పౌరసన్మానం నిర్వహించే ఎం కన్వెషన్ హాల్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా వాహనాల మళ్లింపును చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.