ETV Bharat / state

APSRTC Fares: ఇదేం దోపిడీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఆగ్రహం - ఏపీ న్యూస్

APSRTC Fares: ఒ‍కే సంస్థ.. ఒకే తరహ బస్సు.. సదుపాయాలన్నీ సమానం.. వెళ్లాల్సిన గమ్యస్థానమూ ఒకటే. కానీ టికెట్ ధర మాత్రం వేరు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను మించి ప్రయాణికుల్నిదోపీడీ చేస్తోంది.. ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ ​ఆర్టీసీ. ఇప్పటికే చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ప్రభుత్వం.. బస్సుల్లో రెండు రకాల టికెట్లు అమ్ముతూ వారిని దగా చేస్తోంది. ప్రయాణికులు ప్రశ్నిస్తే మాత్రం.. ఇష్టమైతే ప్రయాణించండి.. లేదంటే మానుకోండి అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు

APSRTC Fares
APSRTC ఛార్జీలు
author img

By

Published : Apr 15, 2023, 3:27 PM IST

APSRTC Fares: ఇదేం దోపిడీ.. ప్రయాణికుల ఆగ్రహం

APSRTC Fares: ఎపీఎస్ ఆర్టీసీలో 11 వేల బస్సులున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులుండగా, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సహా అమరావతి బస్సులు ఉన్నాయి. వీటిల్లో సదుపాయాలను బట్టి బస్సు ఛార్జీలు నిర్ణయిస్తారు. కిలోమీటర్ చొప్పున.. ఒక్కో తరహా బస్సులో ఒకే విధమైన టికెట్ ధర ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ రూట్లో, ఏ డిపో బస్సైనా ఎక్కడ ఎక్కినా దిగినా.. ఒకే రేటు వసూలు చేయాలి. ఆర్టీసీ ప్రారంభించిన నాటి నుంచీ ఎన్నో ఏళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ప్రైవేట్‌ వారిలా బస్సుకో రేటు, పూటకో ధర వసూలు చేసే విధానం ఏపీఎస్ ఆర్టీసీలో ఉండదనేది ప్రజలకున్న నమ్మకం. ఈ నమ్మకమే లక్షలాది ప్రజల ఆదరణ చూరగొనేలా చేసింది. ఇప్పటివరకు ఎంతో పారదర్శకంగా ఛార్టీలు వసూలు చేసిన ఆర్టీసీ.. రూటు మార్చింది. ప్రైవేటు వారిలా దోపిడీ దారి ఎంచుకుంటోంది. ఒకే రూట్లో ఒకే రకమైన బస్సులో వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల్ని దోపిడీచేస్తోంది.

మొదట విజయవాడ - విశాఖ మధ్య రూట్లో అమరావతి సర్వీసుల్లో చార్జీలను.. గుట్టుచప్పుడు కాకుండా పెంచేశారు. అమరావతి ఏసీ బస్సులో టికెట్ ధరను 738 గా నిర్ణయించారు. దీనికి టోల్, రిజర్వేషన్ చార్జీ, సెస్‌లు అంతా కలిపితే 916 రూపాయలు ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్లో అన్ని అమరావతి సర్వీసుల్లోనూ..ఇదే ఛార్జీ వసూలు చేయాలి. కానీ.. అడ్డదారిలో ప్రయాణికులను బాదాలని నిర్ణయించిన ఆర్టీసీ .. గుట్టుచప్పుడు కాకుండా ఈ రూట్లోని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీలు పెంచేసింది.

కొన్ని అమరావతి ఏసీ బస్సుల్లో టికెట్ ధరను వంద పెంచి 830 రూపాయలుగా నిర్ణయించారు. టోల్, రిజర్వేషన్, సెస్‌లు కలసి.. 1015 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరికొన్ని అమరావతి బస్సుల్లో టికెట్ ధరను ఏకంగా 184 రూపాయలు పెంచేశారు. ఈ బస్సుల్లో టోల్, రిజర్వేషన్, సెస్‌లు కలిపి 1113 రూపాయలు బాదేస్తున్నారు.

ఇదే బస్సుల్లో వారం తర్వాత టికెట్ బుక్ చేసుకుంటే ఈ చార్జీలూ మారుతాయి. పెంచిన చార్జీలన్నింటినీ ఏకంగా ఎపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ వెబ్ సైట్లోనే చూపిస్తూ బాదుతుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆన్‌లైన్‌లో టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని చూసి ప్రయాణికులు ఇదేమి దోపిడీ అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్ వారిలా దోపిడీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తే తామేమీ చేయలేమని సమాధానమిస్తున్నారు. ఇప్పటికే ఛార్జీలు పెంచి నడ్డివిరిచారని, దొడ్డిదారిన ఈ దోపిడీ ఏంటంటూ ప్రయాణికులు నిలదీస్తున్నారు.

దీంతో ఆర్టీసీ బుకింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ వారిలా దోపిడీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతా పారదర్శకమని చెప్పుకునే ప్రభుత్వ రంగ సంస్థలో ఈ నిలువుదోపిడీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.