Nara Lokesh Fire on CM Jagan : నాలుగున్నరేళ్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని దుయ్యబట్టారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. నల్లమల అటవీ (Nallamala Forest) ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాస్పత్రిలో మూడు సంవత్సరాలుగా చెట్ల కిందే వైద్య సేవలు (Medical Services Under the Tree) అందిస్తున్నారంటే సీఎం సిగ్గుతో తలదించుకోవాలంటూ ఆయన నిప్పులు చెరిగారు
చెట్టు కింద వైద్యం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజిని సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. అల్లూరి జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడే దిక్క అని నారా లోకేశ్ అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే.. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనా స్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్ల ఎదుట కన్పిస్తుంటే.. తమ హయాంలో వైద్య, ఆరోగ్య రంగం వెలిగి పోతుందని, జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలని లోకేశ్ దుయ్యబట్టారు.
చెట్టు కింద వైద్యం, ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇంత దారుణమా!
Atchannaidu Sensational Comments On CM Jagan Mohan Reddy : రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీ (Cabinet Meeting)లో కనీస చర్చ లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కేబినెట్ భేటీలో చర్చలేదన్నారు. 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు.
జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్
మొక్కుబడిగా 103 కరవు గ్రామాలను ప్రకటించారు : శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక లేదా అని నిలదీశారు. వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. కరవు తీవ్రంగా ఉంటే.. జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 కరవు గ్రామాలను ప్రకటించి చేతులు దులిపేసుకున్నారన్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు జగన్ రెడ్డి దోపిడీ పరిపాలనే కారణమని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.