ETV Bharat / state

Road Accident in AP: విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు - MLC Mohammad Rahutullah

Road Accident in Vijayawada: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో అర్ధరాత్రి ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు బీభత్సం సృష్టించింది. రాత్రి రెండున్నర గంటలకు ఎమ్మెల్సీ కారు ఓ బైక్​ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్​ జిల్లా అనుమంచిపల్లి వద్ద ఐరన్​ బోర్డును బండి ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

Road Accident in Vijayawada
Road Accident in Vijayawada
author img

By

Published : Jun 11, 2023, 11:47 AM IST

విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Road Accident in Vijayawada: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్​లో అర్ధరాత్రి స్థానిక ఎమ్మెల్సీ కారు బీభత్సం సృష్టించింది. బైక్ టాక్సీ నడుపుతున్న పారుపల్లి లక్ష్మణరావు అనే యువకుడు హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికున్ని ఎక్కించుకొని బస్టాండ్ నుంచి బీఆర్​టీఎస్ రోడ్డు మీదగా రామవరప్పాడు కూడలిలో దింపడానికి వెళుతుండగా.. అదే రోడ్లో అతివేగంగా వస్తున్న ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు వెనక నుంచి బైక్​ను ఢీకొట్టగా.. బైక్ నడుపుతున్న లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనకాల ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రున్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్సీ మహ్మద్​ రహుతుల్లా కారు ప్రమాదానికి గురైన వెంటనే దానిపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్​ను తొలగించారు. కార్​ సెన్సార్​ బ్లాక్​ కావడంతో డ్రైవర్​ కారును అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును గుణదల స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

"ఈరోజు ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో బీఆర్టీఎస్​ రోడ్డులో యాక్సిడెంట్​ జరిగింది. రాపిడోలో పని చేసే వ్యక్తి.. హైదరాబాద్​ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని తీసుకొని రామవరప్పాడు వైపు వెళ్తుండగా.. బీఆర్టీఎస్​ రోడ్డులో ఆ బైక్​ను ఓ కారు వెనుకనుంచి ఢీకొట్టింది. బైక్​పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు మరణించగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాం. ఈ ప్రమాదంపై కేసు నమోదైంది"-కృష్ణ మోహన్,​ గుణదల సీఐ

అయితే కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై గుణదల పోలీసులు నోరు విప్పటానికి తటపటాయిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు ఎమ్మెల్సీ కావడంతో.. కొద్దిమంది ఎమ్మెల్సీ అనుచరులు పోలీస్​స్టేషన్ చుట్టూ మోహరించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎమ్మెల్సీకి తెలుపుతున్నారు.

ఐరన్ ​బోర్డును ఢీకొట్టిన బైక్​: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి కాలు తెగిపడింది. షేక్ బాబా, చిన్నం నరేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. రామాపురం క్రాస్ రోడ్ నుంచి షేర్ మహమ్మద్ పేట వెళుతుండగా.. ఆర్టీవో ఆఫీస్ దగ్గర రోడ్ పక్కన ఉన్న ఐరన్ బోర్డుని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బోర్డుని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. షేక్ బాబా కాలు పైనుంచి వెళ్లింది. దీంతో కాలు తెగిపడింది. నరేష్‌కి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మినీ బస్సు బోల్తా: ఏలూరు జిల్లా సత్యనారాయణపురం వద్ద ప్రమాదం మినీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. ఏలూరు ఆశ్రమం ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. నెల్లూరు నుంచి అన్నవరం వెళ్తుండగా.. ముందు వాహనాన్ని తప్పించబోయి మినీ బస్సు బోల్తాపడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.