ETV Bharat / state

Man Attack on Woman: అనుమానంతో సహజీవనం చేస్తున్న మహిళపై హత్యయత్నం - Attempted murder of cohabiting woman

Man Attack on Woman: సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి అనుకోని వ్యక్తి సహజీవనం పేరుతో ప్రవేశించాడు. ఫలితంగా ఆమె జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా ఆమె మరొకరితో మాట్లాడుతోందని ఆ వ్యక్తి అనుమానం పెంచుకున్నాడు. అది సహించలేక పోయాడు. అంతే ఆమెను అంతమొందించాలని ప్రణాళిక రచించాడు. అనుకున్న ప్రకారం ఆమెను ఎవ్వరు లేని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. ఆమె అప్రమత్తమై ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన విజయవాడ నగర శివారులో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 11, 2023, 11:08 AM IST

Man Attack on Woman in Vijayawada : తనతో ప్రేమగా ఉంటూ.. సహజీవనం చేస్తున్న మహిళ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ నగర శివారు నున్న-ముస్తాబాద మధ్యలో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం సీఐ కనకారావు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ.. తన భర్త పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. బర్రె కిరణ్‌ తన భార్యతో కలిసి నగరంలోనే నివసిస్తున్నాడు. అతడు కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె.. వేరొకరితో వాట్సప్‌లో ఛాటింగ్‌ చేస్తుందని, ఫోన్లో మాట్లాడుతోందని బర్రె కిరణ్‌ అనుమానం పెంచుకున్నాడు. తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందని పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో శిశు సంక్షేమశాఖ నగదును బ్యాంకు నుంచి తీసుకోవాలని మాయమాటలు చెప్పి ఆమెను వెంట తీసుకువెళ్లాడు. తన కారులో ఎక్కించుకుని విజయవాడ నగర శివారు నున్న వైపు పయనమయ్యాడు. మార్గ మధ్యలో కారును కృష్ణా జిల్లా గన్నవరం స్టేషన్‌ పరిధిలోని ముస్తాబాద, లంబాడీ పేట వైపు మళ్లించి.. ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఆమెతో గొడవకు దిగాడు. ముందుగా అనుకున్న ప్రకారం వెంట తెచ్చుకున్న.. కత్తితో ఆమెపై దాడికి దిగాడు. చేతిపై, వీపుపై గాయాలు అయ్యాయి.

దీంతో సదరు మహిళ ప్రాణ భయంతో గట్టిగా కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్‌కు వినిపించడంతో , స్థానికులతో కలిసి నిందితుడిని అడ్డుకున్నాడు. డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే నున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పొలాల్లో పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం దాడికి గల వివరాలు సేకరించారు. అది గన్నవరం పోలీస్ స్టేషన్‌ పరిధి కావడంతో.. నిందితుడు బర్రె కిరణ్‌ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కనకారావు తెలిపారు.

ప్రియుడితో కలిసి తల్లి హత్య.. ప్రేమ వద్దు అన్నందుకు మైనర్ కూతురు దారుణం

పక్కా ప్రణాళిక : నిందితుడు బర్రె కిరణ్‌.. మహిళను హత్య చేయాలనే పక్కా పథకంతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చంపడానికి కత్తి, రాడ్డు, గొంతు నులమడానికి వైరు, శవాన్ని చుట్టడానికి పట్టా, తగలబెట్టడానికి పెట్రోల్‌ డబ్బాలను కారులో వెంటతెచ్చుకున్నాడు. అతడికి సంతానం లేరు. భార్యకు తెలియకుండానే విజయవాడ నగరానికి చెందిన మహిళతో గత 12 సంవత్సరాలు సహజీవనం చేస్తున్నాడని సీఐ తెలిపారు. బాధితురాలి భర్త కూడా ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని సీఐ కనకారావు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.