Kesana Shankar Rao అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశన శంకర్‌రావు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. జనగణన నిర్వహించకుండా నివేదిక రాకుండా రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"అగ్రవర్ణలకు పేదలకు రిజర్వేషన్ కల్పించటం వల్ల దేశ జనాభాలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే ఏ రాజకీయం పార్టీ దీని గురించి మాట్లడటం లేదు." -కేశన శంకర్‌రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు
ఇవీ చదవండి: