ETV Bharat / state

Jagan Promise on Kanakadurga Temple Development not Fulfilled: ఇంద్రకీలాద్రి అభివృద్ధి అబద్ధమేనా.. హామీలను గాలికొదిలేసిన సర్కారు - AP Latest News

Jagan Promise on Kanakadurga Temple Development not Fulfilled: విజయవాడ దుర్గగుడి అభివృద్ధి హామీని ప్రభుత్వం గాలికొదిలేసింది. సాక్షాత్తు సీఎం జగన్ హామీ ఇచ్చినా పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇంద్రకీలాద్రిపై 2020 దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పి రెండేళ్లైనా ఇంకా విడుదల కాలేదు. కృష్ణా తీరంలో గుడుల పునర్మిర్మాణం ఊసును ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.

kanakadurga_temple
kanakadurga_temple
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 8:28 AM IST

Updated : Oct 7, 2023, 8:46 AM IST

Jagan Promise on Kanakadurga Temple Development not Fulfilled: ఇంద్రకీలాద్రి అభివృద్ధి అబద్ధమేనా.. హామీలను గాలికొదిలేసిన సర్కారు

Jagan Promise on Kanakadurga Temple Development not Fulfilled: గత పాలకుల నిర్లక్ష్యంతో దుర్గగుడిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని 2020 అక్టోబరు 21న విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ విమర్శించారు. దుర్గ గుడి అభివృద్ధికి 70 కోట్లు ఇస్తామని కొండ రాళ్లు జారిపడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని భక్తులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రెండు దసరాలు వచ్చి పోయాయి. మరికొద్ది రోజుల్లో మూడో దసరా వేడుకలకు ఇంద్రకీలాద్రి సన్నద్ధమవుతోంది. అయినా ఆలయ అభివృద్ధికి ఇస్తామన్న నిధుల ఊసేలేదు. దుర్గగుడి అభివృద్ధికి సీఎం 70 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆలయంలో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్​.. ఆ హామీని మరిచి..!

కొండపై నుంచి రాళ్లు జారి పడకుండా తాత్కాలిక రక్షణ చర్యలు, శివాలయం ఆధునికీకరణతో పాటు మరికొన్ని పనులకు 14 కోట్ల వ్యయం చేశారు. వీటిల్లో కేవలం 5 కోట్లలోపే ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం. దీంతో ఇతర కీలక పనులన్నీ ప్రణాళిక దశలోనే ఆగిపోయాయి. ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడిన సమయంలోనే సీఎం జగన్‌ ఇకపై ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలతో అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులూ పడలేదు. కొండపైన నిలిచే వర్షపునీటి వల్ల మట్టి కరిగి రాళ్లు జారిపడుతుండడం వల్లే ప్రధానంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్​ హామీలు.. ‘చిరు’సాయమూ కరవే!

వరద కాలువ నిర్మాణంతో నీరు కొండ వెనుకవైపు వెళ్లిపోయేలా చేయొచ్చన్న నిపుణుల కమిటీ సలహాను పక్కన పెట్టి కేవలం రాక్‌ మిటిగేషన్‌, డబల్‌ ట్విస్టెడ్‌ వల ఏర్పాటు కింది భాగంలో రక్షణ గోడ తాత్కాలిక పనులతో సరిపెట్టారు. 2021 జనవరిలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ 70 కోట్లతో చేపట్టబోయే పనులకు లక్షలు ఖర్చుపెట్టి ప్రణాళికలు తయారు చేయించగా వాటిని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన కొట్టు సత్యనారాయణ పాత ప్రణాళికలు, నమూనాలు సరిగా లేవంటూ 225 కోట్ల అంచనాలతో 2023 మే నెలలో అన్నదాన భవనం, ప్రసాదం పోటు, ఇతర అభివృద్ధి పనులకు మళ్లీ ప్రణాళికలు రూపొందించారు. విచిత్రమేమిటంటే ఈ ప్రణాళికనూ ముఖ్యమంత్రే ఆవిష్కరించారు. రెండుసార్లు నమూనాలు మారడం తప్ప.. పనులు జరగలేదు.

Impatience With Indrakiladri Lift Operators : ఇంద్రకీలాద్రి లిఫ్ట్‌ ఆపరేటర్ల తీరుపై విమర్శలు.. మహిళలను బలవంతంగా బయటకు తోసేసిన సిబ్బంది

విజయవాడ కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సైతం జనవరి 2021లోనే అధికార పార్టీ నేతల హడావుడి మధ్య పంచెకట్టు.. నుదుట బొట్టుతో సీఎం జగన్‌ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు వీటిని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ శంకుస్థాపన చేసి దాదాపు రెండున్నరేళ్లు దాటినా ఒక్క గుడిలోనూ విగ్రహ పునఃప్రతిష్ఠ జరగలేదు. ఆలయాల పునర్నిర్మాణానికి ఇంకెంత కాలం తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సీఎం శంకుస్థాపనలు చేసిన పనులకే దిక్కులేదు రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి రూట్‌మ్యాప్‌ తయారు చేయాలన్న ఆయన ఆదేశాలేం అమలవుతాయని పెదవి విరుస్తున్నారు.

Last Updated : Oct 7, 2023, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.