ETV Bharat / state

బోయింగ్‌ విమానాలు, జిల్లాకో ఎయిర్ పోర్టంటూ ప్రగల్భాలు! ఉన్న సర్వీసులే రద్దు- అడుగులు దాటని ఎయిర్‌పోర్టులు! - ఏపీలో విమానాశ్రయాలు

Jagan on Airports in AP పొరుగు జిల్లాకు కారు, బస్సు, రైలులో కాదు ఏకంగా విమానాల్లోనే వెళ్దాం. జిల్లాలో ఎయిర్ పోర్టు. జగనన్న చెప్పిన ఈ మాటలు విని జనాలు ఊహాలోక విమానాల్ని విహరించారు. ఐదేళ్లు అయిపోయాయి. కొత్తగా విమాన రెక్కలు రావడం సంగతి పక్కన పెడితే, ఉన్న రెక్కలూ విరిగిపోయాయి. కొత్త సర్వీసుల మాట దేవుడెరుగు ఉన్న సర్వీసులూ ఎగిరిపోయాయి. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల మాటల్లో జగన్‌ మార్కు క్రాష్‌ లాండింగ్‌ ఫలితమిది.

Jagan_on_Airports_in_AP
Jagan_on_Airports_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 10:13 AM IST

Updated : Dec 31, 2023, 10:39 AM IST

Jagan on Airports in AP: మాటల్లో విమానాశ్రయాలు కడితే చేతలు కూల్చేశాయి అన్నట్లుంది జగన్‌ ప్రభుత్వ పరిస్థితి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాలో ఒకే విధంగా విమానాశ్రయాలు ఉండాలి. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలి అని చెప్పారు. బోయింగ్‌ వంటి భారీ విమానాలు కాకున్నా 200 సీటింగ్‌ ఉండే విమానాలైనా వస్తాయని ప్రయాణికులు ఎదురు చూశారు.

కొత్తగా జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించడం మాట ఎలాగున్నా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలనూ 5 ఏళ్ల జగన్‌ పాలనలో పూర్తి చేయలేకపోయింది. గత ప్రభుత్వం ప్రారంభించిన కర్నూలు విమానాశ్రయాన్ని మళ్లీ ప్రారంభించి గతంలో శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేసి తమగొప్పగా చెప్పుకుంటూ జగన్‌ ప్రభుత్వం 5 ఏళ్లు గడిపేసింది.

కొత్తగా ఒక్క విమానాశ్రయాన్ని నిర్మించింది లేదు. కనీసం ప్రతిపాదనలు రూపొందించిందీ లేదు. వివిధ రాష్ట్రాలు, దేశాలకు కొత్త సర్వీసులు నడిపేలా విమానయాన సంస్థలను ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే నడుస్తున్న సర్వీసులు రద్దు చేసుకుని విమానయాన సంస్థలు పలాయనం చిత్తగించేలా చేయడమే జగన్‌ సర్కార్‌ ఘనత. ఈ ప్రభావం ఎంతో కొంత పారిశ్రామిక, ఐటీ రంగాలపై పడింది.

'చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ' ఇది ఒక సినిమాలో నవ్వులు తెప్పించే డైలాగ్‌. జగన్‌ ప్రభుత్వం తీరు అచ్చం అలాగే ఉంది. గత ప్రభుత్వ హయాంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి 2వేల 700 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. అందుకు అవసరమైన భూసేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి విమానాశ్రయ నిర్మాణానికి జీఎమ్ఆర్​ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సీఎం హోదాలో చంద్రబాబు శంకుస్థాపన సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగేళ్లపాటు విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన పక్కనపెట్టింది. ఆ తర్వాత అప్పటి టెండరు ప్రకారమే అదే జీ.ఎమ్.ఆర్​​ సంస్థకు నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతులు ఇచ్చింది. గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే మరోసారి సీఎం జగన్‌ మే 3న శంకుస్థాపన చేశారు. టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును అలాగే కొనసాగించి ఉంటే రెండేళ్ల కిందటే తొలిదశ నిర్మాణం పూర్తయ్యేది. ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చేవి.

దగదర్తి విమానాశ్రయ నిర్మాణం కలేనా?

నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయానిది మరో గోడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. అంతలోనే ఏమైందో ఏమో? దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనను
రద్దు చేశారు. తెట్టు దగ్గర రన్‌ వే అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. రామాయపట్నం పోర్టు దానికి అనుసంధానంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుకు దగ్గరగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తే సరకు రవాణాకు ఉపయోగపడుతుందని గత ప్రభుత్వం దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రతిపాదించింది.

1,350 ఎకరాలను సేకరించి సిద్ధంగా ఉంచిన ఆ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ సర్కార్‌ పక్కనపెట్టింది. కొత్త ప్రతిపాదన ప్రకారం తెట్టు దగ్గర 2వేల 64 ఎకరాలు సేకరించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తవుతుందా? అసలు జగన్‌ సర్కార్‌ను నమ్మి ఎవరైనా భూములివ్వడానికి ముందుకొస్తారా? ఇప్పటికీ డీపీఆర్​ల తయారీ పనే పూర్తవలేదు. ఇక తెట్టుదగ్గర ప్రాజెక్టు ఎప్పుడు రన్‌వే ఎక్కుతుంది?.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానిది ఇంకో కథ. అప్పటి సీఎం చంద్రబాబు 2019 జనవరిలో ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తి చేసి విమానాల రాకపోకలకు వీలుగా సిద్ధం చేశారు. జగన్‌ 2021 మార్చిలో మళ్లీ ప్రారంభించారు. దానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. పెండింగ్‌లో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ యూనిట్, అడ్మినిస్ట్రేషన్, అగ్నిమాపక భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి పేరు పెట్టినంత మాత్రాన విమానాశ్రయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లవుతుందా?.

రెండేళ్లలో బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు సర్వీసులు మినహా మరో కొత్త సర్వీసును కర్నూలు విమానాశ్రయానికి తీసుకురాలేక పోయారు. కర్నూలు నుంచి విశాఖ వెళ్లే సర్వీసును కనీసం గన్నవరంలో నిలపాలనే డిమాండ్‌నూ తీర్చలేకపోయారు. జిల్లాకో విమానాశ్రయం అభివృద్ధి మాట దేవుడెరుగు ఇప్పటికే వినియోగంలో ఉన్న 6 విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది.

రాష్ట్రంలోని ఎయిపోర్టుల్లో నిలిచిన కార్గో సేవలు.. అనుమతులపై ఆరు నెలల ముందే సూచన

రద్దీ రూట్లలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపేలా విమానయాన సంస్థలను ఒప్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఉన్న సర్వీసులనూ ఉపసంహరిస్తుంటే విమానయాన సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులూ జరపలేదు. కొత్త సర్వీసు రావాలంటే నిర్దేశిత వ్యవధిలో స్లాట్‌లు దొరకాలంటే కష్టం. సర్వీసు నడపడానికి వెహికల్‌ విమానయాన సంస్థ దగ్గర అందుబాటులో ఉండాలి. స్లాట్‌ అందుబాటులో ఉంటేనే ఎయిర్‌పోర్టు అథారిటి ఆఫ్‌ ఇండియా సర్వీసు నడపడానికి అనుమతిస్తుంది.

కొత్త సర్వీసులు ఎలాగూ తీసుకురాలేని జగన్‌ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే సర్వీసులు ఒక్కొక్కటిగా విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ కారణంగా 5 ఏళ్లలో విశాఖ విమానాశ్రయం నుంచి గతంలో రోజుకు వచ్చి వెళ్లే సర్వీసుల సంఖ్య 70 నుంచి సగానికి సగం తగ్గాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి నడిచే 60 సర్వీసుల్లో మూడో వంతు నిలిచిపోయాయి. తిరుపతి నుంచి రోజుకు నడిచే సర్వీసుల సంఖ్య 70 నుంచి 60కి తగ్గింది.

కొవిడ్‌ తర్వాత 'వందే భారత్‌' కింద 30కి పైగా దేశాల నుంచి విజయవాడకు సుమారు 200 విమానాలు వచ్చాయి. సుమారు 20 వేలకు పైగా ప్రయాణికులు వచ్చారు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులకు ఎంతగా రద్దీ ఉంటుందనడానికి ఈ లెక్కలే నిదర్శనం. ఇంత ఆదరణ ఉన్నా విజయవాడకు చుట్టుపక్కల నుంచి ఎక్కువగా అమెరికా వెళ్లే వారి కోసం కనెక్టెడ్‌ ఫ్లైట్‌ అందబాటులోలేక దిల్లీలో ఒక రోజంతా వేచి చూడాల్సి వస్తోంది.

టీడీపీ హయాంలో విజయవాడ నుంచి నడిపేలా తీసుకొచ్చిన సింగపూర్‌ సర్వీసూ ఇప్పుడు రద్దైంది. ఇటీవల వారంలో ఒక రోజు కువైట్, రెండు రోజులు షార్జాకు విమాన సర్వీసులను తీసుకొచ్చింది. ఇక విశాఖ నుంచి గతంలో సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, పోర్ట్‌బ్లెయిర్‌కు సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం సింగపూర్‌కు ఒక విమానం వచ్చి వెళ్తోంది. దేశంలో ఏ నగరం నుంచైనా తిరుపతికి విమాన సర్వీసు నడిపితే రద్దీ ఉంటుంది.

రాజమహేంద్రవరం నుంచి గతంలో 12 సర్వీసులుండేవి. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఐదు, బెంగుళూరుకు రెండు, చెన్నైకి కలిపి మొత్తం ఎనిమిది సర్వీసులే నడుపుతున్నారు. కర్నూలు నుంచి బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం సర్వీసులు మాత్రమే ఉన్నాయి. కడప నుంచి కేంద్రం ప్రవేశపెట్టిన 'ఉడాన్‌ పథకం' కింద హైదరాబాద్, బెల్గాం ట్రూజెట్‌ సంస్థ రోజూ సర్వీసులు నడిపేది. పథకం గడువు ముగిసిన తర్వాత వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ మొత్తాన్ని చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం చెన్నై, విజయవాడకు వారంలో నాలుగు సర్వీసులు, బెంగుళూరు, విశాఖపట్నం ప్రాంతాలకు వారంలో మూడు సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పోర్టుల భూసేకరణ కోసం పరిశ్రమశాఖ మార్గదర్శకాలు జారీ

బోయింగ్‌ విమానాలు, జిల్లాకో ఎయిర్ పోర్టంటూ ప్రగల్భాలు! ఉన్న సర్వీసులే రద్దు- అడుగులు దాటని ఎయిర్‌పోర్టులు!

Last Updated : Dec 31, 2023, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.