ETV Bharat / state

Rains In AP: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. నిండా మునుగుతున్న అన్నదాతలు.. ఈరోజు కూడా.! - ఏపీ వాతావరణం

Rains in AP: కోస్తా జిల్లాలో అకాల వర్షాలు రెండోరోజు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో రైతులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి పూర్తిగా తడిచిపోయింది. అకాల వర్షాలకు తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rains In AP
Rains In AP
author img

By

Published : May 1, 2023, 2:23 PM IST

Rains in AP: కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా అంబాజీపేటలోని అరటి మార్కెట్‌లో రైతులు అవస్థలు పడుతున్నారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడవటంతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సాకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

జలమయమైన ఆర్టీసీ బస్టాండ్​: కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, పసుపు, ధాన్యం, మిర్చి పూర్తిగా తడిచిపోయింది. జిల్లాలోని బాపులపాడు మండలంలో అత్యధికంగా 64.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మరోవైపు హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా జలమయమయ్యింది.

మైలవరం మిర్చి యార్డులో తడిచిన మొక్కజొన్న: N.T.R. జిల్లా నందిగామలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మొక్కజొన్న తడిచిపోయింది. తడిచిన మొక్కజొన్నను రైతులు ఆరబోస్తున్నారు. మైలవరం మిర్చి యార్డులో మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యార్డుకు వచ్చి వారం రోజులు గడుస్తున్నా తమను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. పండించిన పంటను వర్షం నుంచి కాపాడుకునేందుకు కనీసం పట్టాలు కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించి తమ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అరటి, మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం జరుగుతుందని రైతులు అందోళన చెందుతున్నారు. బాపట్లలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

పక్కకు ఒరిగిన బస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఏలూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని కొయ్యలగూడెంలో కుండపోత వర్షం కురిసింది.

మట్టిలో దిగబడి రోడ్డు పక్కన వాలిన బస్సు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో దట్టంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజవొమ్మంగి మండలం దూసరపాము 516 ఈ జాతీయ రహదారి పనుల వద్ద బురద పేరుకుపోయి వాహనాలు చిక్కుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సు మట్టిలో దిగబడి రోడ్డు పక్క వాలిపోయింది డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఇతర వాహన చోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏలేశ్వరం నుంచి రేవళ్ల వెళ్తుండగా ఘటన జరగటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

పిడుగులు పడి లక్షల్లో ఆస్తి నష్టం: అనంతపురం, బాపట్ల జిల్లాల్లో పిడుగులు పడి అస్తి నష్టం జరిగింది. అనంతపురం జిల్లా బొమ్మనహల్‌ మండలం వడ్డే కొత్తూరులో పిడుగుపడి లింగప్ప అనే రైతుకు చెందిన 20 పొట్టేళ్లు, గొర్రెలు మృతి చెందాయి. ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల అస్తి నష్టం జరిగిందని రైతు అంటున్నారు. బాపట్ల మండలం మూలపాలెంలో పిడుగు పడి వరి కుప్ప కాలిపోయింది. రెండున్నర ఎకరాల వరి కుప్ప కాలిపోవటంతో రెండున్నర లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని యజమాని అంటున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోవటంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు: నేడు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్​, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉమదని కూడా హెచ్చరించింది. చెట్ల కింద ఎవరు ఉండరాదని, రైతులు, కూలీలు, గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.