ETV Bharat / state

ప్రభుత్వం పిల్లిమొగ్గలు.. సీపీఎస్‌పై సీఎం హామీని నిలబెట్టకోవాలంటున్న ఉద్యోగులు - Government employee unions want clear

Government employee unions: ఓపీఎస్ పై స్పష్టమైన హామీ లేని ప్రభుత్వంతో చర్చలకు హాజరుకాబోమని వివిధ ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. సమాచార లోపంతోనే అలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు నిర్దేశిత గడువు విధించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

సీపీఎస్‌పై చర్చకు పిలుపు
Government employee unions
author img

By

Published : Dec 7, 2022, 7:53 AM IST

Government employee unions on OPS: సీపీఎస్​పై చర్చించేందుకే సమావేశమని 21 ఉద్యోగసంఘాల నేతలకు తొలుత సమాచారం పంపిన ప్రభుత్వం... తర్వాత ఉద్యోగుల సమస్యలపైనే చర్చిద్దామని పిలిచింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘం, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య మినహా మిగిలిన సంఘాలు ఈ భేటీకి హాజరయ్యాయి. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృ ష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

ఉద్యోగులు సమస్యలపైనా ఏ విషయంలోనూ మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం, చేద్దాం, సీఎంతో చర్చించి చెబుతా మనే వైఖరిలోనే సాగిందని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. బిల్లులు నెలలోపు చెల్లిస్తామనే విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదన్నారు. మరోవైపు ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స తెలిపారు.

ఉద్యోగులకు 2018 నుంచి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సంక్రాంతి లోపు, మిగతా వాటిని మార్చిలోపు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘాల నేతలు వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అంగీకారం తెలిపారని వివరించారు. ప్రతినెలా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన రాకపోవడం బాధాకరమన్న ఉద్యోగసంఘాల నేతలు.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చించినట్లు చెప్పారు.

ముఖ ఆధారిత హాజరుపై అధికారులు ఒకలా.. మంత్రులు మరోలా చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. హాజరు నమోదు కాకపోతే జీతంలో కోత పెడతామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండగా.. మంత్రివర్గ ఉప సంఘం మాత్రం కోత లేదని, హాజరు కోసమే అంటు న్నారని వెల్లడించారు.

'సీపీఎస్ అంశంపై ప్రభుత్వం చర్చలు చేస్తే హాజరు కాకూడదని భావిస్తున్నాం. ఆఖరు నిముషంలో ప్రభుత్వం పీఆర్సీ పెండింగ్ అంశాలని సమాచారం ఇచ్చింది. వచ్చే సమవేశం నాటికి సీఎంతో దీనిపై చర్చించి ఉద్యోగుల పెన్షన్ పై చర్చలు చేద్దామని మంత్రుల కమిటీ చెప్పింది. పే స్కేళ్లకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాలకు పంపాల్సిందిగా మంత్రుల కమిటీని కోరడం జరిగింది. ఉద్యోగులకు బకాయిపడిన డీఏకు సంబంధించిన చెల్లింపు రోడ్ మ్యాప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. బకాయిలకు సంబంధించిన నిర్దేశిత గడువు విధించాలని మంత్రుల కమిటీ భేటీలో కోరామని స్పష్టంగా వెల్లడించాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తదుపరి సమావేశంలో చర్చిద్దామని కమిటీ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఎన్జీఓ సొసైటీలకు ఇళ్లస్థలాల విషయంపైనా మంత్రుల కమిటీకి నివేదికను అందించాం'.- ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.