ETV Bharat / state

JEE and NEET: విశాఖలో నీట్, జేఈఈ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

author img

By

Published : May 23, 2023, 9:26 PM IST

NEET, JEE Free coaching Center: బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ల (డీసీఓ) సమీక్షా సమావేశంలో నాగార్జున పాల్గొన్నారు. విశాఖ జిల్లా మధురవాడలో నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రంలో 160 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

NEET, JEE Free  coaching Center
జేఈఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు

NEET, JEE Free coaching Center in Visakhapatnam: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలతో పాటుగా.. మరో శిక్షణా కేంద్రాన్ని విశాఖ జిల్లాలోని మధురవాడలో ప్రారంభించనున్నట్లు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్లలలో (డీసీఓ) మంత్రి సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ప్రస్తుతం ఈ శిక్షణా కేంద్రాలకు ఉన్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని మరో శిక్షణా కేంద్రాన్ని మధురవాడలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రంలో 160 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.

అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ శిక్షణా కేంద్రాలు: ఎస్సీ గురుకులాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర సగటును మించి ఫలితాలను సాధించాయని ప్రస్తావించారు. గురుకులాల విద్యార్థులు పదో తరగతిలో 80.38శాతం, ఇంటర్మీడియట్ లో 74.13 శాతం ఫలితాలను సాధించారని మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. అయితే, పదో తరగతి ఫలితాల్లో ఒక జిల్లా వెనుకబడిందని, ఆ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే తక్కువగా 71 శాతం ఫలితాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. అలాగే జూనియర్ ఇంటర్ లో 63.19 శాతం ఫలితాలు మాత్రమే రాగా... నాలుగు జిల్లాలు ఫలితాల సాధనలో వెనుకబడ్డాయని వివరించారు. ఇంటర్మీడియట్​లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో 1400 మంది సింగిల్ సబ్జెక్ట్​లో ఫెయిల్ అయినవారు ఉన్నారని, వారందరూ ఉత్తీర్ణులయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 56 అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రిన్సిపాల్స్​కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లాలి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 5వ తరగతిలో 14940 సీట్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో తొలి విడతగా 13881 మందిని ఎంపిక చేశామన్నారు. జూనియర్ ఇంటర్ లో 13520 సీట్లు ఉండగా వీటిలో 13180 సీట్లకు తొలి విడతలోనే విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అలాగే 5 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన మరో 1450 సీట్లను కూడా ఆయా జిల్లాల స్థాయిలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. గురుకులాల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా మిగిలిపోకుండా చూసుకోవాలని నాగార్జున అధికారులకు సూచించారు. టీచర్లు, ప్రిన్సిపాళ్లకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోపుగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రిన్సిపాల్స్​కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేరాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.