ETV Bharat / state

'అధికారులతో రాయబారం' కార్యక్రమం.. రైతుల ఆందోళన

Formers Protest: ధాన్యం రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలంటూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద 'అధికారులతో రాయబారం' పేరిట కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేసి 50 రోజులవుతున్నా ఇప్పటికీ నగదు చెల్లించలేదని వాపోయారు.

Raithu Sanghala Rayabaram
అధికారులతో రాయబారం
author img

By

Published : Feb 20, 2023, 4:36 PM IST

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

Formers Protest: ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని, ఇంకా రైతుల వద్ద ఉండిపోయిన ధాన్యం మొత్తం కోనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద అధికారులతో రాయబారం పేరిట ప్రత్యక కార్యక్రమాన్ని చేపట్టారు. అధిక వర్షాలు, తుపానులకు తట్టుకుని ఇబ్బందులు ఎదుర్కొని రైతులు వరి పండించారు. నెల రోజుల క్రితం ధాన్యం మిల్లులకు పంపినా ఇంతవరకు నగదు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. వ్యవసాయ ఖర్చులకు రుణాలు తెచ్చిన రైతులు, వాటికి వడ్డీలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రెండో పైరుగా మినుము, పెసర వచ్చిన తర్వాత వరి కుప్పలు నూర్చే అలవాటున్న ప్రాంతాల్లో, ఈ నెల 16 నుంచి ధాన్యం కొనుగోలు నిలిపి వేస్తామని ప్రకటించడం వారికి పిడుగుపాటుగా ఉందన్నారు. కృష్ణా జిల్లాలో 40 మిల్లుల్లో కొనుగోలు నిలిపి వేశారని, ఇప్పటికీ 40 శాతం కుప్పలు నూర్చాల్సి ఉందని తెలిపారు.

ప్రభుత్వానిదే బాధ్యత... ఏడు డిమాండ్లు: ఖరీఫ్‌ ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఏడు డిమాండ్లను పౌర సరఫరాల శాఖ అధికారుల ముందు ఉంచుతూ రైతు సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు. ఇందులో ప్రధానంగా ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, మిగిలిన ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని, అనధికారికంగా మిల్లులకు పంపించిన ధాన్యానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని, కాటా, రవాణా ఛార్జీలు విడుదల చేయాలని, రైతులకు అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసే అవకాశం కల్పించాలని రైతులకు అవసరమైన అన్ని సంచులను రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంచాలని, ఆర్బీకేలలో అవసరమైన సాంకేతిక పరికరాలు ఉంచాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం.. దళారులు: ధాన్యం కొనుగోలు చేసి 50 రోజులవుతున్నా ఇప్పటికీ నగదు చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో తక్కువ ధరకే దక్కించుకునేందుకు దళారులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.