ETV Bharat / state

కమలం గూటికి బూర నర్సయ్యగౌడ్​.. కండువా కప్పి ఆహ్వానం - ఏపీలో భాజపా

Boora Narsaiah Goud Joined BJP: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌, రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో భాజపాలో చేరారు.

బూర నర్సయ్యగౌడ్​.
Boora Narsaiah Goud
author img

By

Published : Oct 19, 2022, 7:07 PM IST

Boora Narsaiah Goud Joined BJP: తెలంగాణలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. భాజపా దూకుడుతో.. అధికార తెరాసకు ఇబ్బందులు తప్పెలా లేవు. ఇప్పటివరకు తెరాస గుటికి చేరిన రాజకీయ పక్షులు.. ఇప్పుడు భాజపా వైపుగా చూస్తున్నాయి. అందుకు మునుగోడు వేదికగా మారింది. చోటామోట నాయకులతో మెుదలైన చేరికలు.. తెరాసాలో ప్రభావం ఉన్న నేతలిప్పుడు కాషాయం కండువ కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు.

ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌, రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌తో పాటు పార్టీలోకి 16 మంది నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, డీకే అరుణ పాల్గొన్నారు.

కమలం గూటికి చేరిన బూర నర్సయ్యగౌడ్​

ఈ సందర్భంగా మాట్లాడిన బూర నర్సయ్య.. కొందరి కోసం తెలంగాణ కాదు.. అందరి తెలంగాణ రావాలనేదే తన లక్ష్యమని తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బూర నర్సయ్య గౌడ్ భేటీ కానున్నారు.

"కొందరి కోసం తెలంగాణ కాదు.. అందరి తెలంగాణ రావాలనేదే నా లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర, దేశ అభివృద్ధే నా లక్ష్యం.. అందుకే నేను భాజపాలో చేరుతున్నాను దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు".- బూర నర్సయ్య, మాజీ ఎంపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.