Kalva Srinivasulu Comments On Housing Scheme: మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్లు కట్టిన ఇళ్ల కంటే.. కూల్చినవే ఎక్కువని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పక్కా ఇళ్ల నిర్మాణం పడకేసిందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఏటా 5లక్షల ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్లలో కట్టినవి 65వేలు మాత్రమేనని విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద మూడేళ్ల కాలంలో ఏపీలో 5ఇళ్లు మాత్రమే పూర్తైనట్లు కేంద్రం పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని కాలవ ప్రస్తావించారు. నవరత్నాల్లో ప్రధాన హామీగా ఉన్న 25లక్షల ఇళ్ల నిర్మాణం 10శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోకపోవటంపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పేదల్ని ద్వేషించే వ్యక్తి.. మరో వందేళ్లు సీఎంగా ఉన్నా ఏపీలో 25లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇవ్వలేడని తేల్చిచెప్పారు. ఇళ్ల స్థలాల కేటాయింపును కుంభకోణంగా మార్చుకుని వందల కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారనీ, నిరూపించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి