ETV Bharat / state

సమస్యలు పరిష్కరించండి.. విజయవాడలో డప్పు కళాకారుల ధర్నా - విజయవాడలో డప్పు కళాకారులు ధర్నా

Drum artists Dharna: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్​లో డప్పు కళాకారులు ధర్మా చేశారు. వారికి ఇచ్చే పింఛను మరో ఐదు వేల రూపాయలు పెంచడంతో పాటు వయో పరిమితిని 45 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వాన్ని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు కోరారు.

విజయవాడలో డప్పు కళాకారులు ధర్నా
విజయవాడలో డప్పు కళాకారులు ధర్నా
author img

By

Published : Mar 24, 2023, 7:57 PM IST

విజయవాడలో డప్పు కళాకారులు ధర్నా..సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

Drum artists Dharna : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద డప్పు కళాకారులు ధర్నా చేశారు. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి దేవాలయ కమిటీల్లో నియమించాలని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. దీంతోపాటు వారికి ఇచ్చే పింఛను మరో 5 వేల రూపాయలు పెంచాలని, వయో పరిమితి 45 సంవత్సరాలకు తగ్గించాలని అన్నారు.

హక్కులను కాలరాస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం : నాణ్యమైన డప్పు, గజ్జెలు, యూనిఫాంను వయసుతో సంబంధం లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులను భాగస్వాములను చేయాలన్నారు. తుంగభద్ర పుష్కరాలలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాధించుకున్న హక్కులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆనంద్ బాబు మండిపడ్డారు.

డప్పు వాయిస్తూ ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తాం : ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. 4 ఏళ్లు గడిచినా.. ఇప్పటికి కూడా అవి అమలు చేయలేదని ఆయన అన్నారు. తక్షణమే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే డప్పు వాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

"ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డబ్బు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారుల అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలనే ఉద్దేశంతో మేము విజయవాడలో ధర్నా చౌక్​లో ధర్నా నిర్వహిస్తున్నాము. అయితే 2013 లో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తే గానీ మాకు గుర్తింపు రాలేదు. మాకు గుర్తింపు రావటమే కాదు ఫెన్షన్ కూడా అందించాలని మేము మళ్లీ పోరాటం చేస్తే.. మాకు 2019 లో పింఛను ప్రకటించారు. మాకు ఐదు వేల రూపాయల పింఛను పెంచాలని కోరుతున్నాము. అంతేకాక వయసుతో సంబంధం లేకుండా మా ఆత్మ గౌరవాన్ని రక్షించే విధంగా మా అందరికీ డప్పు, గజ్జెలు, యూనిఫాం అందించాలి. " - ఆనంద్ బాబు, ఏపీ డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు

"న్యాయమైన సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పర్మిషన్ అడిగితే చివరి రోజు ఇవ్వడం అనేది సిగ్గు చేటు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారుల న్యాయమైన సమస్యలను వాళ్ల వయో పరిమితి తగ్గించాలి." - మాల్యాద్రి, ఏపీ డప్పు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.