ETV Bharat / state

Deep Water Crisis In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు

Deep Water Crisis In NTR District : ఓ గ్రామం.. నాలుగువేల జనాభా.. నాలుగు బావులు.. వాటిచుట్టూ పెద్ద సంఖ్యలో గాల్లో వేలాడుతూ విద్యుత్ మోటార్లు.. నీటిఎద్దడి ఏ రీతిన ఉందో చెప్పడానికి ఈ గ్రామం ఓ ఉదాహరణ. ఇక్కడ నీటిఎద్దడి ఎలా ఉందో చెప్పడానికి ఈ మోటార్లే నిదర్శనం. నిత్యావసరాల కోసం ఈ నీటిని వాడుకునే గ్రామస్థులు.. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లు పగిలి గ్రామానికి 15 రోజుల నుంచి తాగునీరు అందడం లేదు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉందంటే.. ఎండాకాలంలో నీటిఎద్దడి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Deep_Water_Crisis_In_NTR_District
Deep_Water_Crisis_In_NTR_District
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 10:35 AM IST

Updated : Oct 6, 2023, 6:11 PM IST

Deep Water Crisis In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు

Deep Water Crisis In NTR District : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో నీటిఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని కొళ్లికూళ్ల రక్షితనీటి పథకం ద్వారా అరకొరగా తాగునీరు అందిస్తున్నారు. వరదలకు పైపులైన్లు పగలడంతో 15 రోజుల నుంచి తాగేందుకు ఆ నీరు కూడా రావడం లేదు. దీంతో ఊరి చివరనున్న హేండ్ బోర్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇక స్నానాలకు, ఇతర వాడుకల కోసం గ్రామంలోని నాలుగు బావులపైనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బోర్లు వేసుకుంటే లక్షల్లో ఖర్చవుతుంది.

Thotacharla Villagers Trouble for Drinking Water : నాలుగైదు సార్లు బోర్లు వేసుకుంటేనే గాని ఇక్కడ నీరందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక భారం మోయలేని ఎస్సీ కాలనీ వాసులు చేద బావులనే నమ్ముకున్నారు. బావుల చుట్టూ విద్యుత్ మోటార్లు వేసి నీటిని తోడుకుంటున్నారు. మోటార్లు, విద్యుత్ వైర్లతో బావులు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. ఒక్కో బావిపై సుమారుగా 50 మోటార్లు ఉన్నాయి. బావి నుంచి మోటారుతో తోడిన నీటిని పైపులైన్ల ద్వారా ఇళ్లకు మళ్లిస్తారు. ఇలా బావి నుంచి ఇంటి వరకు పైపులైన్, విద్యుత్ తీగల లైన్లను కొందరు వంద అడుగుల దూరం వరకు ఏర్పాటు చేసుకున్నారు.

గొంతెండుతోంది సారూ.. ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు

Drinking Water Scarcity in AP : ఈ ప్రక్రియ అంతా వ్యయప్రయాసలతో కూడినప్పటికీ నీటి కోసం తప్పడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంత చేసినా వర్షాకాలంలో మాత్రమే వీరు నీటిగండం నుంచి ఇలా తప్పించుకుంటున్నారు. వేసవి వస్తే బావులు అడుగంటిపోతున్నాయి. కొన్నేళ్లుగా వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కూలీనాలి చేసుకునే తాము ఇళ్లలో బోర్లు వేసుకునే ఆర్థిక పరిస్థితి లేదని... వేసినా భూగర్భంలో నీరు లేక వట్టిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.

Water Problem in Guntur: అధికారుల ప్రణాళికా లోపం.. ప్రజలకు శాపం..

మరోవైపు రక్షితనీటి పథకం ద్వారా అరకొరగా అందే తాగునీరు సైతం 15 రోజులుగా రావడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నీటిఎద్దడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన రక్షిత నీటి పథకం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరోవైపు గ్రామంలో నీటిఎద్దడి సమస్యను గ్రామీణ నీటిసరఫరా అధికారుల దృష్టికి వెళ్లగా.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏన్నో ఏళ్లుగా వాడుకుల నీటి అవసరాల నిమిత్తం బావిలో మోటార్లు వేసి నీటిని తోడుకుంటున్నారని చెప్పారు. వాగులో పైపులైన్లు దెబ్బతినడం వల్ల కొన్నిరోజులుగా తాగునీరు రావడం లేదని వీటిని సరి చేస్తామని చెప్పారు.

జలజీవన్ మిషన్ ద్వారా 7 లక్షల రూపాయల నిధుల్ని తాగునీటి అభివృద్ధి పనుల కోసం వెచ్చించనున్నామని గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్.ఈ. వెంకట రమణ చెప్పారు.

చుక్క నీటి కోసం కోటి తిప్పలు.. ప్రాణాలు లెక్కచేయక పోటాపోటీగా!

Last Updated : Oct 6, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.