ETV Bharat / state

తల్లిదండ్రుల ఆత్మహత్య.. దిక్కుతోచని స్థితిలో పిల్లలు

Husband And Wife Suicide: క్షణికావేశం.. సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి.. అప్పటికప్పుడే కఠిన నిర్ణయాలు.. పిల్లలు ఏమైపోతారో కనీసం ఆలోచించలేని దుస్థితి.. ఆ పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది. వారు తీసుకున్న నిర్ణయంతో పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు దూరమయ్యారు.

Suicide
ఆత్మహత్య
author img

By

Published : Feb 8, 2023, 9:47 PM IST

Updated : Feb 8, 2023, 10:12 PM IST

Husband And Wife Suicide: వారిది అందమైన చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం.. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అతను తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు మగ పిల్లలు. ఒకరు పదో తరగతి, మరోకరు 8వ తరగతి చదువుతున్నారు. ఏమైందో తెలియదు గానీ హాయిగా సాగుతున్న జీవితంలో పెను విషాదం నెలకొంది. తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. ఈ విషాద ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

మధిర మండల పరిధిలోని మాటూరు విద్యానగర్ కాలనీకి చెందిన పుట్టా నాగేశ్వరరావు, శ్రీకళ దంపతులిద్దరూ గత కొంతకాలంగా నందిగామ మండలం అనాసాగరంలో నివాసం ఉంటున్నారు. ఇరువురూ మంగళవారం వత్సవాయి మండలం వేములనరం గ్రామం వద్ద గల సుబాబుల్‌ తోటలోకి వెళ్లి శీతల పానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారమే నందిగామ పోలీస్ స్టేషన్లో వీరిపై మిస్సింగ్ కేసు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన దంపతులు ఫోన్ చేసి కాపాడమనీ కోరాడని చెప్పారు. ఇద్దరు మగ పిల్లలు ఉన్నారనీ, ఎటువంటి గొడవలు, అప్పులు లేవని వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని వాపోయారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 8, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.