ETV Bharat / state

Contract Lecturers Protest: కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన.. "సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమిస్తాం " - Latest AP News

Contract Lecturers Agitation: తమ సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతూ కాంట్రక్టు లెక్చరర్లు రోడ్డుకెక్కారు. వారిని రెగ్యులరైజ్​ చేయాడానికి ప్రభుత్వం నిబంధనలను సడలించాలని.. ఎటువంటి నిబంధనలు లేకుండా క్రమబద్ధీకరించాలని కోరారు. వారు రొడ్డెక్కింది తమ సమస్యల పరిష్కారం కోసమని.. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Contract workers protest in Vijayawada
విజయవాడలో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన
author img

By

Published : Jun 11, 2023, 9:13 AM IST

Updated : Jun 11, 2023, 9:55 AM IST

Contractual Lecturers Protest for Regularization: కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్లు శనివారం రోడ్డెక్కారు. 2014 జూన్‌ 2 వరకు ఐదు సంవత్సరాల సర్వీసు ఉండాలనే నిబంధనను తొలగించాలని డిమాండు చేస్తూ.. ‘జగనన్నకు చెబుదాం- కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ పేరుతో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. కాంట్రాక్టు లెక్చరర్లు ర్యాలీ నిర్వహించటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సదస్సు కొనసాగించారు. మా నమ్మకం నువ్వే జగన్‌.. నువ్వే మా దైవం అన్నా అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను చేత పట్టి పదర్శన చేపట్టారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. జూన్​ 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికి కూడా పరిష్కారం దొరకకపోతే 25వ తేదీన మరో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సుప్రీం కోర్టు ఎక్కడ కూడా సర్వీసు నిబంధన పెట్టలేదని గర్తు చేశారు, అటువంటి నిబంధనలే ఉంటే తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించారని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకుడు సురేష్‌ ప్రశ్నించారు.

ఉద్యమ కార్యాచరణ వివరాలు..

  • 11వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి, సమస్య విన్నవించడం.
  • 19 నుంచి 20 వరకు సామాజిక మాధ్యమ వేదికగా సోషల్​ మీడియాల్లో సమస్యను విన్నవించడం. మహిళలతో విజయవాడలో కార్యక్రమం
  • 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉపసంఘంలోని మంత్రులను కలవడంతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించడం
  • సమస్య పరిష్కారం కాకపోతే 25న ఉద్యమ కార్యాచరణ నిర్ణయం

అందర్నీ క్రమబద్ధీకరించాల్సిందే: కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్​ చేశారు. విభజన సమయానికి ఉన్న అందరికీ వర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నామని అన్నారు. అందరికీ న్యాయం చేయాలని.. కొందరు ఫోన్లు చేసి ఏడ్చేస్తున్నారని తెలిపారు. అయిదేళ్ల సర్వీసు నిబంధన అన్యాయంమని, గతంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఆందోళనల వల్లే వారికి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్‌ను కలిసి సమస్యను విన్నవిస్తానన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులంతా స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించాలని సూచించారు. వారి సమస్య పరిష్కారం అయ్యేవరకూ కృషి చేస్తామని వెల్లడించారు.

ఏ కోర్టు చెప్పింది..: అయిదేళ్ల సర్వీసు ఉన్నవారినే క్రమబద్ధీకరించాలని ఏ కోర్టు చెప్పిందని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నేత కొప్పిశెట్టి సురేష్‌ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు వర్తించదా అన్న ఆయన.. సుప్రీంకోర్టు ఐదు, పదేళ్లు అని ఎక్కడా చెప్పలేదని వివరించారు. క్రమబద్ధీకరించడం ఆర్థికభారం అంటున్నారని.. కాంట్రాక్టు వాళ్లంతా మంజూరైన పోస్టుల్లోనే పనిచేస్తుంటే ఆర్థికభారం ఎలా అవుతుందన్నారు. ఈ విషయాలను ప్రజాప్రతినిధులందరికీ చెప్పాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తారని.. దాన్ని గమనించాలని కాంట్రక్టు ఉద్యోగులకు సూచించారు.

పునరాలోచన చేయాలి: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై పునరాలోచించాలని చిత్తూరు జిల్లాకు చెందిన షాన అనే కాంట్రాక్టు లెక్చరర్​ కోరారు. పునరాలోచన చేస్తారని ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని దీమా వ్యక్తం చేశారు. కొందర్ని క్రమబద్ధీకరిస్తే కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య విద్వేషాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరినీ కలిపి ఉంచేలా చూడాలని ప్రతి ఒక్కరి కన్నీటి ఆవేదనను జగనన్న ఆలకించి క్రమబద్ధీకరిస్తారని అనుకుంటున్నామని అన్నారు.

వ్యతిరేకించటం లేదు విన్నవించుకుంటున్నాం: అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని అనంతపురం జిల్లాకు చెందిన శాంతి అనే కాంట్రాక్టు లెక్చరర్‌ ప్రభుత్వాన్ని కోరారు. అక్కాచెల్లెమ్మలకు జగన్‌ ఎన్నో పథకాలు ఇస్తున్నారని.. కాంట్రాక్టు ఉద్యోగులనూ సర్వీసు నిబంధన లేకుండా క్రమబద్ధీకరించాలని అన్నారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. విన్నవించుకుంటున్నాని ఆమె తెలిపారు. క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో చెప్పారని.. మ్యానిఫెస్టోలోనూ పెట్టారని గుర్తు చేశారు.

నూతన ఐకాస ఏర్పాటు : ఏపీ కాంట్రాక్టు లెక్చరర్ల ఐకాసను కొత్తగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా కె.సురేష్‌ను, కో ఛైర్మన్లుగా కల్లూరి శ్రీనివాస్‌, లామా పద్మారావు, సాయిరాజు, రామకృష్ణలు ఎంపికయ్యారు. పీవీ నారాయణను రాష్ట్ర సమన్వయకర్తగా నియమించారు.

కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన

Last Updated : Jun 11, 2023, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.