ETV Bharat / state

రాష్ట్రంలో పోలీసులు తీరు బాగా మెరుగుపడింది: సీఎం జగన్​

Police Martyrs Remembrance Program : ఏపీలో పోలీసుల పని తీరు బాగా మెరుగుపడిందని సీఎం జగన్​ కొనియాడారు. అలాగే మహిళలపై నేరాల విచారణకు సమయం కూడా చాలా తగ్గిందని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్​ పాల్గొన్నారు. అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Police Martyrs Remembrance Program
Police Martyrs Remembrance Program
author img

By

Published : Oct 21, 2022, 12:26 PM IST

CM JAGAN APPRECIATE POLICE OFFICERS : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అమరవీరుల త్యాగాలను తెలిపేలా రచించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరణ చేశారు. దేశవ్యాప్తంగా 264 మంది, ఏపీలో 11 మంది 2021-2022 మధ్య విధినిర్వహణలో అమరులయ్యారన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6,511 మంది పోలీసు నియామకాల కోసం జీవో ఇచ్చామని సీఎం వెల్లడించారు.

శ్రీకాకుళం, రాజమండ్రిల్లో ఐఆర్‌ (IR) బెటాలియన్​లు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్ ఉద్యోగాల్లో హోం గార్డ్​లకి రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 16 వేల మంది మహిళా పోలీస్​లను నియమించామని తెలిపారు. దిశ యాప్​ను 1.17 లక్షల మంది డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. 23,339 దిశ ఫిర్యాదులు వస్తే, పోలీసులు స్పందించి కాపాడారన్నారు. పోలీస్ పనితీరు మెరుగుపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళల కేసుల విషయంలో గతంలో నెలలు పట్టే విచారణను.. కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారన్న జగన్​.. ఇది గొప్ప మార్పు అని అభినందించారు. రాష్ట్రంలో ఫిర్యాదులు పెరిగి నేరాలు తగ్గాయని తెలిపారు. ఆపదకి ముందే స్పందించిన ఐదుగురు పోలీసు​లను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్​ఆర్ అచీవ్​మెంట్​ కింద ఎంపిక చేశామని తెలిపారు.

శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు రాజీ పడవద్దని సీఎం సూచించారు. హోం మంత్రి కూడా ఓ దళిత మహిళ అని ఆయన అన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇంటింటికి అమలు చేయడం వలన మావోయిజం తగ్గిందన్నారు. పోలీస్​లకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరిస్తామని తెలిపారు. పోలీస్ వీక్లీ ఆఫ్​లు అమలు చేయాలన్న సీఎం.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్​ సీఎస్ విజయానంద్, హోం మినిస్టర్ తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.