CM Jagan Inaugurates Hyatt Place Hotel in Vijayawada: ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకమైన స్ధానం సంపాదించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అందుకోసం అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చి పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మంచి చైన్ హోటల్స్‌ను సైతం ప్రోత్సహిస్తూ వచ్చామన్నారు. ఒబెరాయ్‌తో మొదలుకుని హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్‌ను(Hyatt Place Hotel Vijayawada) ముఖ్యమంత్రి ప్రారంభించారు. హోం మంత్రి తానేటి వనిత, పర్యటక శాఖ మంత్రి రోజా, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. విజయవాడలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్, ప్రముఖ హోటల్స్ వచ్చి.. ఏపీ కూడా గ్లోబల్ ఫ్లాట్‌ఫాం మీద నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ హోటల్స్ ఇంకా రావాలని, ఇవి రాష్ట్రమంతటా విస్తరించాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సహకాలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు.
CM Jagan Administration from Visakha: దసరా నాటికి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన.. జోరుగా ప్రచారం
"విజయవాడకు హయత్ ప్లేస్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ హోటల్ వచ్చింది. రాష్ట్రంలో మంచి పర్యాటక పాలసీ రూపొందించి అమలు చేస్తున్నాం. 11 పెద్ద బ్రాండ్ల హోటళ్లను తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ హోటల్స్ ఇంకా రావాలి. అవి రాష్ట్రమంతటా విస్తరించాలి. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలి. మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఒబెరాయ్‌తో మొదలుకుని హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం" -వైఎస్ జగన్, ముఖ్యమంత్రి
CM Jagan: 'నేతన్న నేస్తం' నిధులు విడుదల చేసిన సీఎం.. 'సేవకులపైనే విమర్శలా..?'
CM Jagan to Devineni Avinash House: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఇంటికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. గుణదలలో హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎం ప్రారంభించారు. సమీపంలోనే ఉన్న తమ నివాసానికి రావాలన్న అవినాష్ ఆహ్వానంతో సీఎం వెళ్లారు. అవినాష్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారి పిల్లలను పలకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరి వెళ్లారు.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు