Chandrababu Couple Visits Indrakeeladri In Vijayawada : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులకు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును నేతలు గజమాలతో సత్కరించారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు
Chandrababu Naidu Visits Kanaka Durga Temple : కనకదుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నానని తెలిపారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానని తెలిపారు. కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణని అన్నారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్ధించానని చంద్రబాబు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవ దర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు.
Chandrababu Visit Tirumala Temple : నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. ఆదివారం సింహాచలం అప్పనను దర్శించుకుంటారు. ఈ నెల 5 వ తేదీన శ్రీశైలం మల్లన్న సేవలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రానున్న రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీ మాత చర్చిలను చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారని సమాచారం.
TDP Chief Chandrababu Naidu Schedule : ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్నారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై దిల్లీ వెళ్లి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేయాలని ఆయన నిర్ణయించారు. డిసెంబరు 6 నుంచి ఎనిమిదో తేదీలోగా సమయం ఇవ్వాలని సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నట్టు సమాచారం.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముందుండాలి - టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం