ETV Bharat / state

ఇప్పటికి గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్ష రాయండి - అధికారంలోకి వచ్చాక మెయిన్స్ గురించి ఆలోచిద్దాం! - గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 విడుదల తేదీ

APPSC Group 2 Jobs Notification 2023 Release: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్​-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌-1తో పాటు ఇతర శాఖల్లో ఖాళీలపై ఏపీపీఎస్సీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇతర వివరాలాలకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ సంప్రదించాలని అధికారులు తెలిపారు.

APPSC_Group_2_Jobs_Notification_2023_Release

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 7:24 AM IST

APPSC Group 2 Jobs Notification 2023 Release : ఏపీలో ఎట్టకేలకు గ్రూప్​-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. వైఎస్సార్​సీపీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న సమయంలో నోటిఫికేషన్ జారీ చేయడం ఆసక్తిగా మారింది. గ్రూప్‌-1తో పాటు ఇతర శాఖల్లో ఖాళీలపై ఏపీపీఎస్సీ (Andhra Pradesh Public Service Commission) ఎలాంటి ప్రకటన చేయలేదు.

APPSC Group 2 Notification 2023 Last Date : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్​-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 జూన్‌లో జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రకటించిన గ్రూప్​-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ వెలువడేందుకు 29 నెలల సమయం పట్టింది. ఈ కాలయాపనతో సుమారు 50 వేల మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయి ఉంటారని అంచనా. ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నవంబరు 1న ఏపీపీఎస్సీ వెల్లడించింది. కానీ, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 897 పోస్టులే ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్‌ తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్‌ జరుగుతుందని చెప్పకనే చెప్పింది. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఇవన్నీ జరిగి ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు చాలా సమయమే పడుతుంది.

గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Group 2 Exam Date : నోటిఫికేషన్‌ కింద ప్రకటించిన పోస్టులు ఇప్పటికిప్పుడు గాలిలో నుంచి కొత్తగా సృష్టించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఖాళీల జాబితా సిద్ధంగా ఉన్నా, భర్తీ చేయడం ఇష్టం లేక ఇన్నాళ్లు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసిందని ఆరోపణలున్నాయి. మరోపక్క పోస్టుల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పాయింట్స్‌, పే స్కేలు వివరాలు నోటిఫికేషన్‌లో లేవు. గ్రూపు-1తో పాటు ఇతర శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్న ఏపీపీఎస్సీ గురువారం కేవలం గ్రూపు-2 మాత్రమే జారీ చేసింది. మిగిలిన నోటిఫికేషన్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 331, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 566 ఉన్నాయి. గ్రూపు-2 నోటిఫికేషన్‌ అనుసరించి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 21 నుంచి స్వీకరిస్తారు. జనవరి 10 వరకు స్వీకరణ జరుగుతుంది.

AP Govt Permits for Filling Group2 Service Vacancies: గ్రూప్​-2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వ అనుమతి.. ఎన్ని పోస్టులంటే..?

వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ సంప్రదించండి : డిగ్రీ, ఆపై విద్యార్హత అర్హత కల్గిన వారు గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హులుగా ఎపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంబంధించి పూర్తి వివరాలు, వయసు, విద్యార్హతలు, రిజర్వేషన్లు, సిలబస్, పరీక్షా విధానం, తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్​ను ఎపీపీఎస్సీ వెబ్ సైట్​లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ అంతా తప్పుల తడక, కుట్రపూరితం! పోస్టులు అమ్ముకోవడానికి వైసీపీ కుట్ర చేస్తోంది: సప్తగిరి ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.