- గుడివాడలో ఉద్రిక్తత.. తెదేపా మాజీ ఎమ్మెల్యేను చంపేస్తామని బెదిరింపులు
రావికి ఫోన్ చేసి బెదిరించిన వైకాపా నేత మెరుగుమాల కాళీ కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును చంపేస్తామని బెదిరింపులు రావికి ఫోన్ చేసి బెదిరించిన వైసీపీ నేత మెరుగుమాల కాళీరేపు వంగవీటి వర్ధంతి కార్యక్రమం ఎలా చేస్తారని రావికి బెదిరింపులు.
- ఎన్నికలకు ముందు.. మద్యపాన నిషేధం..!: కోలగట్ల వీరభద్ర స్వామి
Deputy Speaker Kolagatla Veerabhadra Swamy: ప్రభుత్వం త్వరలో మద్యపాన నిషేదంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని ఎన్నికలలోపు మద్యం నిషేధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుంటే,.. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఒక్క ఇంటి తలుపుతట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.
- రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్
APTF Protest : వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలకు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫెడరేషన్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాద్యాయులు నిరసనలకు వెళ్లకుండా పోలీసులు ఇప్పటినుంచే వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కశ్మీర్లో భారీగా ఆయుధాలు.. పంజాబ్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
కశ్మీర్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఎనిమిది ఏకేఎస్-ర74 రైఫిళ్లు, 12 చైనా పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- దేశంలో కొత్త వేరియంట్ కలవరం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ బీఎఫ్.7 భారత్‌ను భయపెడుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అతడి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు అధికారులు.
- నేపాల్ పొలిటికల్ డ్రామా.. కుప్పకూలిన సంకీర్ణం.. తదుపరి ప్రధానిగా ప్రచండ
నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు సీపీఎన్-ఎంసీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ప్రధాని పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలన్న ఒప్పందంపై సంధి కుదరకపోవడం వల్ల.. ప్రస్తుత సంకీర్ణ కూటమి విచ్ఛిన్నం కాగా.. మాజీ ప్రధాని ఓలితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ సిద్ధమయ్యారు.
- భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై.. ఆదర్శంగా ప్రియాంక ప్రయాణం!
కష్టపడి పనిచేస్తే సాధించనిదంటూ ఏదీ ఉండదు అనే దానికి ఈమె నిదర్శనం. అందరిలా కాకుండా భిన్నమైన రంగంలోకి వెళ్లి దానిలో విజయం సాధించింది ఆ మహిళ. సాధారణంగా ఆడవాళ్లు కార్లు, ఆటోలు, బైక్‌లు నడపడం చూస్తుంటాం. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా బస్సు నడిపేస్తున్నారు. అంతేకాదు, ఏకంగా ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించారు.
- అతి కష్టం మీద టెస్టు సిరీస్ గెలిచారు.. మరి సమస్యల సంగతేంటి?
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతికష్టం మీద విజయం సాధించింది టీమ్ఇండియా. చిన్నపాటి టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టును బంగ్లా బౌలర్లు హడలెత్తించారు. అశ్విన్, శ్రేయస్ తోడ్పాటుతో గట్టెక్కారు. కానీ టీమ్ఇండియా చాలా సమస్యలతో సతమతమవుతోంది. ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇదే.
- అందరి కళ్లు జనవరి 8పైనే.. KGF స్టార్ యశ్ కొత్త సినిమా అప్డేట్?
'KGF' సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు సంపాందించుకున్నారు నటుడు యశ్. 'కేజీయఫ్ 2' కూడా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో యశ్ తదుపరి చిత్రంపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే యశ్ కొత్త చిత్రం గురించి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..