ETV Bharat / state

Minister Peddireddy Presentation On Sand Mining: 'ఇసుక తవ్వకాలతో సంబంధం లేదు.. ఖజానాకు ఆదాయం వచ్చిందా.. లేదా అనేదే ముఖ్యం'

Minister Peddireddy On Sand Mining: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై మంత్రి పెద్దారెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు. ఇసుక తవ్వకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వివరాలు వెల్లడించారు. ఇసుక తవ్వకాల విషయంలో చంద్రబాబుకు రెవెన్యూ వ్యవహారం అర్ధం కాక.. లేనిపోని అపోహలు, కట్టుకథలు చెప్పి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఇష్టారీతిన ఆరోపణలు గుప్పించారు.

Presentation On Sand Mining
Minister Peddireddy
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 7:16 PM IST

Updated : Sep 1, 2023, 6:34 AM IST

Minister Peddireddy Presentation On Sand Mining: ఆంధ్రప్రదేశ్​లో గతకొన్ని రోజులుగా ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు, ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. వివరణ ఇవ్వాలంటూ 'ఇసుక సత్యాగ్రహం' పేరుతో టీడీపీ నేతలు మూడు రోజులపాటు ఆందోళనలు చేపట్టారు. ఇసుక తవ్వకాలు జరిపే బాధ్యతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. జేపీ పవర్‌ వెంచర్స్‌ అప్పగించడంతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా ఇసుక తవ్వి, అమ్మేస్తున్నారని విమర్శించారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారంటూ.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇసుక తవ్వకాలపై గురువారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు.

'ఇసుక తవ్వకాలతో సంబంధం లేదు.. ఖజానాకు ఆదాయం వచ్చిందా.. లేదా అనేదే ముఖ్యం'

Minister Peddareddy Comments: మంత్రి పెద్దారెడ్డి మాట్లాడుతూ..''రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఎవరు చేసుకున్నా ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం జమ అయ్యిందా..? లేదా..? అన్నదే ముఖ్యం. ప్రస్తుతం ఏపీలో జేపీ వెంచర్స్ సంస్థే ఇసుక తవ్వకాలు జరుపుతోంది. ఇప్పటి వరకూ రూ.6.7 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే.. ప్రభుత్వానికి 2,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ వెంచర్స్ సంస్థకు ఇచ్చాం. జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాల విషయంలో సబ్ కాంట్రాక్ట్ ఎవరికిచ్చినా.. అది మా ప్రభుత్వానికి సంబంధం లేదు.'' అని అన్నారు.

TDP Sand Satyagraham Protest: టీడీపీ ‘ఇసుక సత్యాగ్రహం’.. ముఖ్య నేతలు గృహ నిర్బంధం

Peddireddy Comments On Chandrababu: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన ఇంటి వెనుక ఇసుక దోపిడీ జరిగిందని.. మంత్రి పెద్దిరెడ్డి ఆక్షేపించారు. డ్వాక్రా మహిళల పేరు చెప్పి, ఇసుకను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. పారదర్శకంగానే జేపీ వెంచర్స్​కు ఇసుక కాంట్రాక్ట్​ను అప్పగించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి ఇసుక ద్వారా రూ.765 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని.. మంత్రి పెద్దిరెడ్డి వివరాలు వెల్లడించారు.

Mines Director Venkat Reddy comments: ఇసుక తవ్వకాల విషయంలో గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ ప్రభుత్వ అధికారినన్న విషయాన్ని మర్చిపోయి.. ఓ రాజకీయ నాయకుడిలా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రెవెన్యూ వ్యవహారం చంద్రబాబుకు అర్ధం కాలేదని.. అందుకే లేనిపోని అపోహలు, కట్టుకథలు చెప్పి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Sand Mining Effects : ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున 'ఇసుక' తవ్వకాలు.. భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదు!

''జేపీ వెంచర్స్ సబ్ కాంట్రాక్టు ఒప్పందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రధాన కాంట్రాక్టరుగా ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారా..? లేదా..? అన్నదే చూస్తాం. ఆన్​లైన్ ద్వారా డబ్బు వసూలు చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల సౌకర్యం కోసమే నగదు వసూలు చేస్తున్నాము. ఆంధ్రా శాండ్ పోర్టల్ ద్వారా ఆన్​లైన్​లోనూ బుకింగ్​కు అవకాశం కల్పించాం. డిజిటలైజేషన్ లేని ప్రాంతాల్లో అనుమతులు అవసరం లేదు. ఏడాదికి రెండు కోట్ల మెట్రిక్ టన్నుల వినియోగం మాత్రమే ఉన్నట్టు తేల్చాం. బేస్ ధరగా రూ. 375 పెడితే రూ.750 కోట్లు వస్తుందని అంచనా వేశాం. సీఎం జగన్ కొత్త ఇసుక విధానం తెచ్చి, ఖజానాకు రూ.765 కోట్లు తెచ్చారు. ఉచిత ఇసుక విధానంలో అనుమతులు ఎక్కడివి..?'' -వెంకట్ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్.

NGT Orders to Stop Sand Mining: 'తాజా పర్యావరణ అనుమతులు లేకుండా.. ఇసుక తవ్వొద్దు'.. మరోసారి స్పష్టం చేసిన ఎన్జీటీ

Last Updated : Sep 1, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.