ETV Bharat / state

'సీఎం జగన్ అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వడంలేదు' రాజకీయ వేదిక ఉండాలనే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు : సుబ్బారాయన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 7:19 PM IST

Another New Political Party in AP: రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ప్రారంభమైంది. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బారాయన్ ప్రకటించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తమకు ఒక రాజకీయ వేదిక ఉండాలని ఆలోచనతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీని ఏర్పాటు చేశామని సుబ్బరాయన్ తెలిపారు.

new_political_party
new_political_party

Another New Political Party in AP: రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ప్రారంభమైంది. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ (Another new political party) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బారాయన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుబ్బారాయన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో పెన్షనర్లు లేరని తేల్చి చెప్పారు. పెన్షనర్లు ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తమకు ఒక రాజకీయ వేదిక ఉండాలని ఆలోచనతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీని ఏర్పాటు చేశామని పి సుబ్బారాయన్ తెలిపారు.

AMARAVATI PADAYATRA : కడలి తరంగాలై.. కదిలివచ్చిన రాజకీయ పార్టీలు!

నిరుద్యోగులను తయారుచేసే కర్మాగారాలుగా కళాశాలలు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను, పెన్షనర్లను, రైతులను పట్టించుకోవడం పూర్తిగా మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కళాశాలల పరిస్థితి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా తయారైందని దుయ్యబట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు.. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను సారా దుకాణాల్లో పని చేసే వారిలా మార్చిందని సుబ్బారాయన్​ మండిపడ్డారు. యువకులు రాష్ట్రంలో ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు (Unemployed youth in AP) తరలిపోతున్నారు.. వారు మాత్రమే కాకుండా వచ్చిన పరిశ్రమలు.. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు.

BCY Cheif Ramachandra Yadav On YSRCP: 'వైసీపీ అరాచకాలకు ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉంది'

రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే దుస్థితికి వచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తులన్నీ రాష్ట్రానికి మంచిదా? అని ప్రశ్నించారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పెన్షనర్ల సత్తా ఏమిటో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని సవాల్​ విసిరారు. మేధావుల మౌనం ఈ రాష్ట్రానికి మంచిది కాదని హితవుపలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి వాటిపై మాట్లాడడండి.. ఏదైనా సమస్య వస్తే మీకు అండగా పెన్షనర్స్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.

త్వరలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు : మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్

Bharata Chaitanya Yuvajana Party: రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇటీవల బీసీవై (భారత చైతన్య యువజన) పేరిట పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్ర యాదవ్‌(Ramachandra Yadav) ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని చెప్పారు. గుంటూరు శివారులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించి.. పార్టీ పేరును రామచంద్రయాదవ్‌ ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే .. కొత్త రాజకీయ ప్రస్థానం జరగాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.