Andhra University Lawyers get-together Party in Vijayawada : వాళ్లది పది, పాతికేళ్ల బంధం కాదు అర్థ సెంచరీ కొట్టిన స్నేహం.ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1973 బ్యాచ్ న్యాయ విద్యార్థులు. వారు ప్రతీ ఏటా కలిసి సుఖ దుఃఖాలు పంచుకుంటారు. ఎప్పటిలాగే ఈ సారీ విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. సతీసమేతంగా వచ్చి ఉత్సహంగా గడిపారు. ఈ పూర్వవిద్యార్థుల సమావేశానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకప్పుడు చదువులమ్మ చెట్టు నీడలో సేదతీరిన వీరంతా మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకుని ఒకప్పటి అనుభూతులను నెమరువేసుకున్నారు.
గెట్ టు గెదర్ @ 5తరాలు.. 300 కుటుంబాలు
Lawyers Get Together Party 2023 : ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి పిల్లలే అన్నట్లే ఎంత స్థాయికి వెళ్లినా వారంతా ఒకనాటి మిత్రులే, తుంటరి పిల్లలే. విశాఖటపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1973-1976 మధ్య న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థులంతా విజయవాడలోని ఓ హోటల్ లో మళ్లీ కలుసుకున్నారు. కళాశాలలో ఎదురైన మధురానుభూతులను కలబోసుకున్నారు. ఈ సమావేశానికి పూర్వ విద్యార్థులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ శేషశయనారెడ్డి, జస్టిస్ కె.జె.శంకర్, జిల్లా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. కళాశాల రోజుల్లో అందరి మాదిరిగానే ఉత్సాహంగా ఉండేవాళ్లమని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. ఎమర్జన్సీ కాలంలో కొందరు జైళ్లకు వెళ్లి వచ్చిన వారున్నారని గుర్తుచేశారు. ఇన్నేళ్లలో ఏం చేస్తున్నామో ఒకరిని మరొకరు అడిగి తెలుసుకుని అవలోకనం చేసుకుంటామని జస్టిస్ శేషశయనారెడ్డి చెప్పారు.
ఆత్మీయ కలయిక... బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Childhood memories : అప్పట్లో కళాశాలలో కంటే ఇప్పుడు తాము మరింత ఉత్సాహంగా ఉన్నామని చెబుతున్నారు వీరు. ఈ రోజు కోసం ఎదురు సంవత్సరమంతా ఎదురు చూస్తుంటామని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండ్రోజులు తమను తాము మర్చిపోయి కాలేజీ రోజుల్లా గడుపుతామని చెప్తున్నారు. ఈ 48 గంటల సంతోషం ఏడాది మొత్తానికి బూస్టులా పని చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఒకరిని చూసి మరొకరం చాలా విషయాలు నేర్చుకుంటామని సొంత అక్కా-చెల్లెల్లతో కూడా షేర్ చేసుకోలేవి పంచుకుంటామని తెలుపుతూ వారి ఆత్మీయతను చాటుకుంటుకుంటున్నారు.
Friends Meetings : ప్రతీ ఏడాది డిసెంబరు రెండో శనివారం, ఆదివారం కలుసుకునే ఈ మిత్రులు ఉత్సవాల అనంతరం కలిసికట్టుగా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తామని, వివిధ ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకుంటాని అన్నారు.