ETV Bharat / state

విద్యా, ఆరోగ్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి - Andhra Pradesh health department news

cm jagan review of Medical and Health Department: కరోనా కేసులకు సంబంధించి, టీచర్ల నియమాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. సమీక్షలో భాగంగా దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పట్ల అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. సమీక్షలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

cm jagan review
cm jagan review
author img

By

Published : Apr 10, 2023, 10:14 PM IST

cm jagan review of Medical and Health Department: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నేడు విద్య, వైద్యాశాఖ మంత్రులతో, అధికారులతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినితోపాటు సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పిల్లలకు టీచర్ల కొరత ఎక్కడా రాకూడదు: ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ''విద్యార్థుల సంఖ్యను బట్టి వారి తగినట్టుగా పరిశీలన చేసుకుని, పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించండి. పిల్లలకు టీచర్ల కొరత ఎక్కడా రాకుండా చర్యలు తీసుకోండి. విద్యార్థుల డ్రాపవుట్లను తగ్గించేలా నిరంతర చర్యలు, పర్యవేక్షణ చేపట్టండి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోండి. స్కూళ్లకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలి. రాష్ట్రంలోని అన్ని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ క్షేత్రస్ధాయిలో ఇప్పటికే విద్యాశాఖ సినర్జీతో పట్టిష్ఠంగా ఉంది. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుంది. ఒకవేళ పిల్లలు బడికి రాని పక్షంలో మీరే వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీయండి'' అంటూ సూచనలు చేశారు.

సర్టిఫికెట్‌ కోర్సుల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌: అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినీ ట్రాక్‌ చేస్తున్నామని, డ్రాప్‌అవుట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మే 15 నాటికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామన్నారు. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం డ్రాపవుట్ల విధానాన్ని తీసుకు వచ్చామన్నారు. దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. ఈ క్రమంలో మద్రాసులోని ఐఐటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులు పెట్టాలన్నారు. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందన్నారు. 1998వ సంవత్సరం నాటి డీఎస్సీలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు ఈ వేసవిలోనే శిక్షణా తరగతులను ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశిలిచ్చారు.

అన్ని రకాలుగా సిద్ధంగా ఉండండి: కరోనా వ్యాపిస్తోందన్న హెచ్చరికల దృష్ట్యా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కొవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టి, ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వారికి వెంటనే మందులను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీలో కొవిడ్ అదుపులోనే ఉంది: రాష్ట్రంలో కొవిడ్ తాజా పరిస్థితిపై, నివారణపై సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. కొవిడ్ విషయంలో తీసుకుంటోన్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, కొత్త కేసుల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వివరించారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్ధాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించారు. ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ చెక్‌ చేసి సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

మరికొన్ని రోజుల్లో కాలేజీలు, ఆసుపత్రుల్లు పూర్తి: జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా నిర్మించాల్సిన విజయనగరం జిల్లా, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో షెడ్యూలు ప్రకారమే.. పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అనంతరం మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో క్యానర్స్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, క్యానర్స్ విభాగంతో సహా మూడు బ్లాకులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.