AP CM Jagan meeting on untimely rains: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల.. ముఖాలలో చిరునవ్వులు కనిపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వర్షాల కారణంగా కల్లాల్లో తడిసిన, రంగుమారిన పంటలను (ధాన్నాన్ని) కొనుగోలు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.
సీఎంఓ అధికారులతో సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎంఓ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్న మాట వినపడకూడదన్నారు. ఈ అకాల వర్షాల కారణంగా రైతులకు కలిగిన పంట నష్టంతోపాటు ఇతర నష్టాలను కూడా గ్రామ సచివాలయాల స్థాయి నుంచే ప్రతి నిత్యం వివరాలను రాబట్టుకోవాలన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా పంట నష్టపోయిన విషయాలతోపాటు తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించాలి.. సీఎం జగన్ మాట్లాడుతూ..''రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఇది పూర్తి స్థాయిలో జరగాలి. అలాగే, ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలి. ఏ రైతన్న మిగిలిపోతే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయిన ఏ రైతులకు కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదనే మాట వినపడకూడదు. రబీ సీజన్‌కు సంబంధించిన పంట కొనుగోలు ప్రక్రియను కూడా అతి వేగవంతంగా చేపట్టాలి. అంతేకాదు, పంటల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రభుత్వం పంటలను కొనటం లేదన్న మాట కూడా ఎక్కడ్నుంచి వినిపించకూడదు, రాకూడదు. ప్రతి రైతుకు ఏదైనా ఇబ్బందులు గానీ, ఫిర్యాదులు గానీ ఉంటే వాటిని పరిష్కారించడానికి (నివేదించడం) కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదులను ఆరోజే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చివరగా ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు కనపడేలా ప్రతి అధికారి చర్యలు తీసుకోవాలి'' అని ఆయన ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును పరిష్కరించండి.. అనంతరం పంట నష్టం అంచనాలు ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను.. కచ్చితంగా గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలని అధికారులను సీఎం జగన్ కోరారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం విషయంలో అధికారులు అప్రమత్తమై.. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పంట కొనుగోలు చేయడం లేదనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. రైతుల ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్న జగన్.. ఆ నెంబర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.
ఇవీ చదవండి