Andhra America Velvadam Village Development: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని చిన్న అమెరికాగా గుర్తింపు పొందిన వెల్వడం గ్రామంలో 10వేల వరకు జనాభా ఉంది. మిగతా గ్రామాలతో పోల్చిచూస్తే అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది. ఇక్కడ నుంచి సుమారుగా 600 మంది వరకు అమెరికా వెళ్లి విద్య, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు. మరికొంతమంది వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 1960 దశకంలో గ్రామానికి చెందిన లకిరెడ్డి బాలిరెడ్డి అనే పెద్దాయన ముందుగా అమెరికాకు పయనం కాగా.. ఆయన సహకారంతో కుటుంబ సభ్యులు, తర్వాత గ్రామస్థులంతా ఒక్కొక్కరు ఆమెరికా వెళ్తున్నారు.
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి: చిర్ల జగ్గిరెడ్డి
Inspiration of Lakireddy Balireddy: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వెల్వడం వాసులు స్థిరపడ్డారు. గ్రామం నుంచి లకిరెడ్డి బాలిరెడ్డి స్ఫూర్తితో ఆయన సోదరుడు డాక్టర్ హనిమిరెడ్డి, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం వంటివారు ఎందరో అమెరికా పయనమయ్యారు. ఒకే గ్రామం నుంచి ఇంతమంది అమెరికాలో స్థిరపడటంతో వెల్వడం గ్రామానికి చిన్న అమెరికాగా పేరొచ్చింది. పేరే కాదు గ్రామం తీరూ మారిపోయింది. ఎన్నారైల సహకారంతో గ్రామంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది.
No Political Fights in Velvadam: శివాలయం, పాఠశాల భవనాలు, బస్ షెల్టర్ వంటి నిర్మాణాలెన్నో ఏర్పాటయ్యాయి. ఇళ్లు ఆకాశ హర్మ్యాలను తలపిస్తాయి. విశాలమైన సిమెంట్ రహదార్లనూ నిర్మించారు. మిగతా గ్రామాల్లో ఎక్కడా కన్పించని విధంగా 2 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగు కాల్వలను నిర్మించారు. దోమలు, చెత్తాచెదారాలకు కేంద్రంగా ఉండే ఓపెన్ డ్రైన్లు అక్కడ కన్పించవు. దీనికితోడు మిగతా గ్రామాల్లో హడావుడి రేకిత్తించే రాజకీయ గొడవలు అక్కడ విన్పించవు.
కొత్త పాలకవర్గం కొలువుదీరిన వేళ.. చేయిచేయీ కలిపితేనే ప్రగతి మాల..!
Villagers Celebrate Festivals with NRIs: గ్రామస్థులంతా ఒకేమాట.. ఒకేబాటగా ఉంటారు. శివరాత్రి, వినాయకచవితి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఎన్నారైలతోపాటు గ్రామస్థులంతా కలిసి ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ఒకప్పుడు లకిరెడ్డి బాలిరెడ్డి, నేడు డాక్టర్ హనిమిరెడ్డి మార్గదర్శకత్వంలో వెల్వడం గ్రామం అన్నివిధాలా ముందుకెళ్తుందని చెబుతున్నారు గ్రామస్థులు. ఒకప్పుడు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేశారు బాలిరెడ్డి సోదరులు.
Development with NRIs: పాఠశాలకు అదనపు భవనాలతోపాటు ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. ప్రతి ఏటా ప్రతిభావంతులైన పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నారు. గ్రామాభివృద్ధిలో ఎన్నారైలు కీలకపాత్ర పోషిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. తాము అభివృద్ధి చెందటమే కాకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న వెల్వడం ఎన్నారైల దాతృత్వం మరెన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది'
"మా గ్రామం నుంచి లకిరెడ్డి బాలిరెడ్డి అనే పెద్దాయన ముందుగా అమెరికాకు పయనం కాగా.. ఆయన సహకారంతో కుటుంబ సభ్యులు, తర్వాత గ్రామస్థులంతా ఒక్కొక్కరు ఆమెరికా వెళ్తున్నారు. ఇంతమంది అమెరికా వెళ్లి స్థిరపడటంతో మా గ్రామానికి చిన్న అమెరికాగా పేరొచ్చింది. పేరే కాదు గ్రామం తీరూ మారిపోయింది. ఎన్నారైల సహకారంతో గ్రామంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. శివాలయం, పాఠశాల భవనాలు, బస్ షెల్టర్, సిమెంట్ రహదారులు వంటి నిర్మాణాలెన్నో ఏర్పాటయ్యాయి. మా గ్రామంలో రాజకీయ గొడవలు కన్పించవు. మా గ్రామస్థులమంతా ఒకేమాట.. ఒకేబాటగా ఉంటాము. శివరాత్రి, వినాయకచవితి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఎన్నారైలతోపాటు గ్రామస్థులంతా కలిసి ఉత్సవాలు నిర్వహించుకుంటాము." -గ్రామస్థులు