Amaravati Farmers Lacked Employment During YCP Regime: తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని.. భవిష్యత్తు బాగు పడుతుందని.. అక్కడి రైతులు, రైతు కూలీలు ఆశించారు. అమరావతి నిర్మాణం జరిగితే.. పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడి ఉపాధి దొరుకుతుందని సంతోషించారు. కానీ, రాజధాని నిర్మాణం ఆగిపోవటం.. భూములిచ్చిన రైతులకు శాపంగా మారింది. ఉన్న భూముల్ని ప్రభుత్వం భూ సమీకరణకు తీసుకోవటంతో వ్యవసాయ పనులు లేకుండా పోయాయి. మరోవైపు రాజధాని నిర్మాణం జరగక పోవటంతో.. అమరావతిలో రైతు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 3 రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన మూర్ఖపు ప్రకటనతో ఈ దుస్థితి ఏర్పడిందని రైతు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Amaravati was Selected During TDP Regime: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిలా ఉంటుందని.. తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు జిల్లా కృష్ణాతీర ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సింగపూర్ ఇచ్చిన బృహత్ ప్రణాళికతో పాటు.. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది.
YCP Govt stopped Construction of Capital: ఆ తర్వాత పగలు, రాత్రి తేడా లేకుండా రాజధాని నిర్మాణ పనులు కొనసాగాయి. ఇక్కడి కూలీలు సరిపోక విజయవాడ, గుంటూరు నుంచి కూడా కూలీలూ పనికోసం వచ్చేవారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో అమరావతి నిత్యం సందడిగా ఉండేది. కాగా 2019లో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో అప్పటి వరకు రాజధాని నిర్మాణ పనులతో ఉపాధి పొందిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వెంటనే వైసీపీ 3 రాజధానుల నిర్ణయం తీసుకోవటంతో స్థానిక రైతు, రైతు కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్థంబించడంతో అవన్నీ మూతపడ్డాయి. పనులు ఆగిపోవటంతో రాజధాని భూముల్లో ముళ్ళకంప, పిచ్చి మొక్కలతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉపాధి పొందిన కూలీలకు ఇప్పుడు పనులు లేకుండా పోయాయి.
Smallholder Farmers who Gave Land to the Capital: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారిలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కవ మంది ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి భూమిలేక, పనులు లేక ఆగమ్యగోచరంగా మారింది. పెరిగిన ధరలు, ఖర్చులతో ఆదాయం సరిపోక వ్యవసాయ కార్మికులు సతమతమవుతున్నారు. కృష్ణానది పక్కనే ఉండటంతో పుష్కలంగా నీరుండటంతో గతంలో సంవత్సరం పొడవునా పంటలు పండించే వారు. పంట కొని వేరే చోటకు తీసుకెళ్ళి అమ్మి మరికొంతమంది ఉపాధి పొందేవారు. రాజధాని 29 గ్రామాల్లో నదీ తీరంలోని గ్రామాల్లో ఇసుక రీచ్‌లు ఉండేవి.
Employment or Farmers Conditions: దీంతో వందల సంఖ్యలో ఇసుక కార్మికులుగా ఉపాధి పొందేవారు. ఇప్పుడా ఇసుక రీచ్‌లు మూత పడటంతో వారందరికీ ఉపాధి కరవైంది. వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించక పోయినా పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. వృద్దాప్యంతో ఉన్నవారు సైతం కూలీలకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. వారందరూ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేమని, రాజధాని గ్రామాల్లోనే ఉపాధి చూపించి ఆదుకోవాలని కోరుతున్నారు.
World Bank Loan for Capital Formation.. గతంలో రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు గురించి ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడు.. వ్యవసాయ కూలీల ఉపాధి కోసం ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. గ్రామాల్లో రైతు కూలీల జీవన విధానం, ఆర్ధిక పరిస్థితులు, ఉపాధి చర్యలు, సీఆర్డీఏ (CRDA) ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, నర్సరీలు, నిర్మాణ కార్యక్రమాల్లో ఉపాధి వంటి అంశాలను అధికారులు వివరించారు. రాజధానిలో పేదలకు ఫించన్లు, వ్యాపారాల కోసం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు 29 గ్రామాల్లోని పేదల ఉపాధికి సంబంధించి కూడా నాటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేసింది.
Capital Farmers Fire on YCP Govt: అంతేకాకుండా, భూమి లేని వ్యవసాయ కార్మికులకు పని చూపించేందుకు CRDA చర్యలు తీసుకుంది. రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి పనులు కల్పించింది. మరికొంత మందికి హైకోర్టు, సచివాలయం, శాసనసభ వంటి కార్యాలయాలు, 29 గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనులు కల్పించింది. తుళ్లూరులో నైపుణ్య శిక్షణ కేంద్రానికి భవనం ఏర్పాటు చేసారు. CRDA ద్వారా వివిధ పనుల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించింది. దీంతో అనేక మంది చిరు వ్యాపారులుగా మారారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఉన్న ఉపాధి పోయింది. ప్రజలకు, రైతులకు ఉపాధి చూపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు.
Stopped Works in the Capital: రాజధానిలో అనేక పనుల కోసం వచ్చేవారితో పాటు..సందర్శకులు పెరగటంతో వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు మాదిరిగా జోరుగా సాగాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. రాజధానిలో భవన నిర్మాణాల కోసం తాపీ పనిచేసేవారికి గిరాకీ ఉండేది. ఇప్పుడు వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్లు ఇతర వాహనాలకు డిమాండ్ ఉండేది. కాబట్టి కొందరు వాహనాల ద్వారా ఉపాధి పొందారు. రాజధాని నిర్మాణ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల వద్ద చాలా మంది ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం నైపుణ్య శిక్షణ కేంద్ర భవనం CRDA కార్యాలయంగా మారింది. నైపుణ్య శిక్షణ ఆగిపోయింది. రాజధానిలోని నర్శరీలు మూతపడ్డాయి. రాజధాని ప్రాంతానికి వచ్చేవారు లేకపోవటంతో వ్యాపారాలు పడిపోయాయి. ఇళ్లలో అద్దెకు ఉండేవారు కూడా లేకుండా పోయారు. ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లేనని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.
Capital Farmers Going to Other Areas for Work: వ్యవసాయ పనులు లేకపోవడంతో పాటు రాజధాని నిర్మాణం ఆగిపోవటంతో ఉపాధి లభించక కార్మికుల జీవితాలు దయనీయంగా మారాయి. ఉన్న ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళితే కానీ ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా దూరం వెళ్లిరావటానికి రవాణా చార్జీలు అదనపు భారం అవుతున్నాయి. మందడం, తాళ్ళాయపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన కార్మికులు అరటి గెలలు కోసేందుకు కడప, కర్నూలు, మహానంది వంటి ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రాజధాని గ్రామాలను పట్టణ ప్రాంతంగా పరిగణించి ఇక్కడ ఉపాధిహామీ పనులు తీసేశారు. ఒక్క అనంతవరం గ్రామంలో మాత్రం సీజన్లో ఉపాధిహామీ పనులు జరుగుతాయి.
YCP Govt has Stopped Giving Rent: అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను కూడా గత ప్రభుత్వం భూ సమీకరణలో తీసుకుంది. సంబంధింత రైతులకు కూడా గత ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించి కౌలు చెల్లించేంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని CID, సిట్ విచారణల పేరుతో కౌలు ఇవ్వటం ఆపేసింది. ఇప్పుడు దళిత రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోలేక... కౌలు రాక... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువులు, పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. రాజధానిలో ఉండ లేక చాల మంది ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని రైతులు చెబుతున్నారు.
YCP Govt Cheated By Promising to give 5,000 Pension: భూమి లేని పేదలకు గత ప్రభుత్వం 2500 రూపాయల ఫించను ఇచ్చేది. ఇక్కడి భూములను రాజధాని కోసం తీసుకుంటే స్థానికంగా ఉండేవారికి ఉపాధి లేక ఇబ్బంది పడుకూడదని నాటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించింది. తాము అధికారంలోకి వస్తే పేదల ఫించన్‌ను 5వేల రూపాయలకు పెంచుతామని చెప్పిన జగన్‌మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం పట్టించుకోలేదు. ఇక్కడి పేదల పరిస్థితి ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాకు చెందిన 50,793 మందికి ఇటీవల అమరావతిలో సెంటు భూమి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. రాజధానిలో నిర్మాణ పనులు లేక, ఉపాధి దొరక్క ఇక్కడ ఉన్న పేదలే ఇబ్బందులు పడుతుంటే ఇతర ప్రాంతాల నుంచి అలాంటప్పుడు వారందరికి ప్రభుత్వం ఏ విధంగా ఉపాధి కల్పిస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Amaravati Capital Farmers JAC: అమరావతి భూములను దోచుకునేందుకే.. సీఎం కొత్త నాటకానికి తెర