ETV Bharat / state

పవన్​ను ఏదో ఒకరోజు.. ఉన్నతస్థాయిలో చూస్తాం: చిరంజీవి

chiranjeevi
chiranjeevi
author img

By

Published : Nov 20, 2022, 3:10 PM IST

Updated : Nov 20, 2022, 4:38 PM IST

15:03 November 20

పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి

పూర్వ విద్యార్థుల సమావేశంలో చిరంజీవి

Chiranjeevi latest Comments: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న చిరంజీవి.. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన కల్యాణ్ సమర్థుడని పేర్కొన్నాడు. పవన్​ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో చూసే అవకాశం వస్తుందని చిరంజీవి అభిలాషించారు.

"ఏదైనా తలచుకుంటే దాని అంతుచూడటం నాకు అలవాటు. నా మనసులో నుంచి రాకపోతే.. నేను దాని అంతు చూడలేను. నేను అంతు చూడనది అంటే ఏంటో మీకు తెలుసు. అందుకే అక్కడినుంచి వెనక్కి వచ్చా. అక్కడ రాణించడం కష్టం.. అక్కడ సెన్సిటివ్​గా ఉండకూడదు. బాగా మొరటుగా ఉండాలి.. రాటు దేలాలి. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. అవసరమా ఇది.. తాను తగినవాడు.. తాను అంటాడు, అనిపించుకుంటాడు.. అలాంటివాళ్లకు మీరందరూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో ఏదో ఒకరోజు అత్యున్నతస్థానంలో మనం చూస్తాం. -చిరంజీవి

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించిన నర్సాపూర్ వైఎన్ఎంసీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ఈ వ్యాఖ్యలు చేశారు. కళాశాల అధ్యాపక బృందాన్ని, సహచార మిత్రులను ఆత్మీయంగా సన్మానించిన మెగాస్టార్.. నాటి కళాశాలలో చదివిన రోజులను గుర్తు చేసున్నారు. పాఠాల కంటే జీవిత పాఠాలను ఎలా చదవాలో వైఎన్ఎంసీ కళాశాల నేర్పించిందన్నారు. నటుడిగా క్రమశిక్షణతో ఉన్నానంటే కళాశాలలోని ఎన్​సీసీ నేర్పించిన పాఠాలేనన్నారు. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ డీఎస్ ఆర్ వర్మ, గ్రంధి భవానీ ప్రసాద్​తో పాటు పెద్దసంఖ్యలో నాటి మిత్రులంతా ఈ వేడుకకు హాజరై నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Last Updated : Nov 20, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.