ETV Bharat / state

కోదాడ నుంచి కూతురొచ్చినా.. నందిగామకు అంబులెన్స్ రాలే.. - nandigama hospital

waiting for ambulance : ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని దేవినేని వెంకటరమణ ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో 108 అంబులెన్స్ కోసం ఓ మహిళ గంటల తరబడి ఎదురుచూసింది. ఆమె కూతురు కోదాడ నుంచి బస్సులో ఇక్కడకు చేరుకున్నా.. అప్పటికీ అంబులెన్స్ రాకపోవడంపై బంధవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నందిగామ ప్రభుత్వ సామాజిక వైద్యశాల
నందిగామ ప్రభుత్వ సామాజిక వైద్యశాల
author img

By

Published : Jan 31, 2023, 12:58 PM IST

waiting for ambulance : ఆపదలో ఉన్న ఓ మహిళ అంబులెన్స్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి మంగళవారం నందిగామలో చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. అత్యవసరంగా తరలించాలని చెప్పగా అంబులెన్స్ కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అదిగో వస్తున్నాం.. ఇదిగో వస్తున్నాం.. అంటున్నారే తప్ప.. మధ్యాహ్నం 12గంటల వరకూ రాకపోవడంపై రోగి బంధువులు మండిపడుతున్నారు.

నందిగామ ప్రభుత్వ సామాజిక వైద్యశాల

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన కోట అన్నమ్మ తీవ్రమైన జ్వరం, ఆయాసంతో వైద్యశాలలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి సీరియస్​గా ఉందని బంధువులకు చెప్పారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపాలని నిర్ణయించారు. వారు ఉదయం 7:55 గంటలకు 108కు కాల్ చేసి అంబులెన్స్ పంపించాలని కోరారు. ఎంతసేపు ఎదురుచూసినా అంబులెన్స్ రాకపోవడంతో రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. చావు బతుకుల మధ్య అవస్థలు పడుతున్న ఆమెను వెంటనే విజయవాడకు తరలించాల్సి ఉంది. దాదాపు 4 గంటలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న రోగి కుమార్తె నవ్యాంజలి .. కోదాడ నుంచి బస్సులో నందిగామ చేరుకున్నా అంబులెన్స్ రాకపోవటం గమనార్హం. అంబులెన్స్ ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి చచ్చి పోతున్నా పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అంబులెన్స్ పంపించి ప్రాణాలు కాపాడాలని కోరారు. అదిగో వస్తున్నాం.. ఇదిగో వస్తున్నాం.. అంటున్నారే తప్ప ఎప్పుడు వస్తారో కచ్చితంగా చెప్పడం లేదని వాపోయారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.