YCP leader Arrested in Nandyala : నంద్యాల జిల్లా మహానంది వైసీపీ నాయకుడు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన జమాల్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నాయకున్ని పోలీసులు అరెస్టు చేశారు. జమాల్ రెడ్డిపై దాడి చేసి ఖాళీ ప్రాంసరి నోట్లపై సంతకాలు చేయించి, ఇంటిని స్వాధీనం చేసుకునే యత్నం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదంతా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే, కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి తనపై అక్రమ కేసులు బనాయించారని బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన రాజకీయ ఎదుగుదల సహించలేకనే టార్గెట్ చేశారని చెప్పారు. తన కూతుళ్లు ఒకరు మహనంది ఎంపీపీ, మరొకరు సీతారామపురం గ్రామ సర్పంచిగా కొనసాగుతున్నారని అది జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. తనకు ఏమైనా జరిగితే రాజకీయ నాయకులు, పోలీసులే కారణంగా చెప్పారు. జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఇవీ చదవండి: