నంద్యాలలో ఇటీవల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు ఆలస్యంగానైనా చర్యలు తీసుకున్నారు. విధుల్లోనిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండో పట్టణ సీఐ రమణను సస్పెండ్ చేశారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డితోపాటు ఏఎస్సై కృష్ణారెడ్డిని వీఆర్‌కు పంపారు. సురేంద్రను ఇటీవల రౌడీషీటర్ దారుణంగా హత్యచేశారు. కానిస్టేబుల్‌నే రోడ్డుపై వెంటాడి చంపడం పెద్ద సంచలనమైంది. పోలీసులకే రాష్ట్రంలో రక్షణ లేదంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.
ఇవీ చదవండి: Iron locker ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి బయటపడ్డ ఐరన్ లాకర్